twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఎన్ఆర్ ‘విప్రనారాయణ’ రీమేక్‌లో నాగార్జున?

    By Bojja Kumar
    |

    నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు, మహానటి భానుమతి కాంబినేషన్లో 1954లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'విప్రనారాయణ' చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జైబాలాజీ రియల్ మీడియా అధినేత తాండ్ర రమేష్ తన మిత్రుడు కొమర వెంకటేష్‌తో కలిసి దీన్ని నిర్మించబోన్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ..... 'విప్రనారాయణ' చిత్రం అప్పట్లో చరిత్ర సృష్టించిన గ్రేట్ క్లాసికల్ హిట్. ఇలాంటి కమనీయమైన చిత్రాన్ని మళ్లీ తెరకెక్కిస్తున్నందుకు ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే సారి తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ పోషించిన 'విప్రనారాయణ' పాత్రను ఓ ప్రముఖ కథానాయకుడు పోషిస్తాడు. ఓ ప్రముఖ దర్శకుడితో ఈ సినిమా విషయమై సంప్రదింపులు జరుపుతున్నాం. హీరోయిన్ పాత్రకు విద్యాబాలన్, దీపికాపడుకొనెలతో డేట్స్ గురించి డిస్కర్షన్ చేస్తున్నాం. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

    కాగా...సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ పాత్రకు నాగార్జునను ఎంపిక చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని, గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాల్లో అద్భుతంగా నటించిన ఆయన్ను ఖరారు చేసే ఆలోచన ఉందని, అయితే నాగార్జున ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవడంతో వారు ఆ విషయం బయటకు చెప్పడం లేదని అంటున్నారు. నాగార్జునకు హిందీలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఏది ఏమైనా నాగార్జున నటిస్తాడా? లేదా? అనే విషయం ఖరారు కావాల్సి ఉంది.

    English summary
    
 Akkineni Nageswara rao, Bhanumathi starrer super hit classical movie 'Vipranarayana' will be remake On Jai Balaji Real media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X