క్రేజ్ మామూలుగా లేదుగా....‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్

వరుణ్‌ తేజ్‌, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం 9000'. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై క్రిష్‌ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. డిసెంబర్‌ 21న సినిమా విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఏర్పడటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే స్థాయిలో జరిగింది. తెలుగులో వస్తున్న తొలి స్పేస్ మూవీ కావడం, 'ఘాజీ' తెరకెక్కించిన డైరెక్టర్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

 ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 19 కోట్లు

ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 19 కోట్లు

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘అంతరిక్షం' చిత్రానికి రూ. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ మార్కెట్‌తో పోలిస్తే మంచి ధరకు అమ్ముడు పోయినట్లే అని అంటున్నారు.

ఏరియా వైజ్

ఏరియా వైజ్

ఏరియా వైజ్ బిజినెస్ పరిశీలిస్తే.... నైజాం రూ. 5 కోట్లు, సీడెడ్ రూ. 2 కోట్లు, ఆంధ్రా ఏరియా: రూ. 7.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 1 కోటి, ఓవర్సీస్ రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగిందట.

 ఇప్పటికే అంచనాలు పెంచేసిన ట్రైలర్

ఇప్పటికే అంచనాలు పెంచేసిన ట్రైలర్

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. నీరా అనే శాటిలైట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే ఇందులో సాంకేతిక సమస్య రావడంతో రంగంలోకి దిగిన దేవ్(వరుణ్ తేజ్) ఏం చేశాడు? శాటిలైట్ ప్రయోగం విఫలం కాకుండా ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు అనేది తర్వాతి కథ.ఫెయిల్ అయితే ఎలా? అని అడక్కూడదు... గెలవాలంటే ఏం చేయాలి అని మాత్రమే అలోచించాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.

హాలివుడ్ టెక్నీషియన్స్

హాలివుడ్ టెక్నీషియన్స్

ది ఎక్స్‌పెండబుల్స్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ, హెర్క్యులెస్, ది ఇన్‌విజబుల్, లవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో‌పోలో, గేమ్ అఫ్ థ్రోన్స్ వంటి హాలివుడ్ ప్రాజెక్టులకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ ఈ చిత్రానికి పని చేశారు.

కలిసొచ్చే క్రిస్మస్ సీజన్

కలిసొచ్చే క్రిస్మస్ సీజన్

క్రిస్మస్ హాలిడే సీజన్ ఈ చిత్రానికి కలిసొస్తుందని భావిస్తున్నారు. వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ, డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ, కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి, స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X