అంతరిక్షంపై అంచనాలు పెంచేలా.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు!
Recommended Video

రొటీన్ కమర్షియల్ చిత్రాలతో విసిగిపోయిన ఆడియన్స్ కోసం డిసెంబర్ లో ఓ ఉత్కంఠ భరిత చిత్రం రాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న అంతరిక్షం చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అండర్ వాటర్ మిషన్ అంటూ ఘాజి చిత్రంలో సబ్ మెరైన్ యుద్ధంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. తాజా చిత్రం ద్వారా ఆడియన్స్ ని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లబోతున్నాడు.

మతి పోగొట్టే విజువల్స్
చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతరిక్షం చిత్రంలో విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉంటాయి అని తెలిపాడు. ఈ చిత్రంలో అద్భుతమైన అంశాలు ఆడియన్స్ మనసు దోచుకోవడం ఖాయం. పట్టున్న కథ కథనాలతో ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి స్పేస్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలిపారు.

గొప్ప అనుభూతి కలిగించేలా
ఈ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ తో రూపొందించిన సన్నివేశాలు ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలిగించేలా ఉంటాయి. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి నటన ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటుందని సంకల్ప్ రెడ్డి తెలిపాడు.

విజయంపై ధీమాగా
ఈ చిత్ర విజయంపై నిర్మాతలు, దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇస్రో నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. డిసెంబర్ 21 న అంతరిక్షం చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

వరుణ్‌కు జోడిగా
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి వ్యోమగాములుగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిదా, తొలిప్రేమ వంటి సూపర్ హిట్స్ తరువాత వరుణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంతరిక్షంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











