3 మిలియన్లు దాటేసిన అంతరిక్షం ట్రైలర్.. స్పేస్ థ్రిల్లర్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం చిత్ర ట్రైలర్ నిన్ననే విడుదలయింది. ట్రైలర్ తో సినిమాలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆకట్టుకునే డ్రామాతో పాటు, నరాలు తెగే ఉత్కంఠని కలిగించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి ఈ చిత్రంలో వ్యోమగాములుగా నటిస్తున్నారు. ఘాజి చిత్రం తరువాత సంకల్ప్ రెడ్డి నుంచి వస్తున్న మరో ప్రయోగం ఇది.

ట్రైలర్ ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ దాటేసి యూట్యూబ్ ట్రేండింగ్ లో నెం 1గా కొనసాగుతోంది. ట్రైలర్ కు ఇంత మంచి రెస్పాన్స్ అందించినందుకు వరుణ్ తేజ్ ప్రేక్షకుల కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతరిక్ష పరిశోధన, ఓ స్పేస్ మిషన్ కు సంబంధించి వరుణ్ తేజ్ చేసే విన్యాసాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.

 Antariksham Trailer clocks 3 million view

డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ లాంటి విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రాన్ని సంగీతం అందించాడు. జ్ఞాన శేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ సమర్పణలో ఈ చిత్రం రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X