అంత సీన్ లేదు...ఆవిడే ఈవిడ (ఫోటో)
హైదరాబాద్: యువ హీరోలు నవదీప్ శశాంక్ కలిసి నటిస్తున్న తాజా సినిమా 'అంత సీన్ లేదు'. ఈ సినిమా టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. అయితే ఫస్ట్ లుక్ ఫోస్టర్‌లో ఓ హీరోయిన్ ఫేస్ కనిపించకుండా వెనక వైపు నుండి సెక్సీగా అందాలు ప్రదర్శిస్తూ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో కనిపించబోయే ఆ కొత్త హీరోయిన్ ఎవరు? అనే ఎదురు చూపులకు తెర పడింది. ఆమె ఫేస్ కనిపించేలా మరో పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆమె మరెవరో కాదు ముంబై మోడల్ రేహ్నా మల్హోత్రా. సినిమా విడుదలకు ముందు నుండే తన అందాలతో ఆకట్టుకున్న రేహ్నా మల్హోత్రా సినిమాలో ఏ రేంజిలో చూపిస్తుందో?
ఈ సినిమా ఒక కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. సిద్దార్థ్ హీరోగా నటించిన 'లవ్ ఫెయిల్యూర్' సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించిన చక్రవర్తి రామచంద్ర ఈ సినిమాకు బ్యాడ్ మంకీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విడుదల త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాలో ఇద్దరు కొత్త హీరోయిన్లు నటిస్తున్నారు. వెంకట్ కాచర్ల తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












