For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అష్టా చెమ్మ’ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొత్త చిత్రం కాన్సెప్టు

    By Srikanya
    |
    హైదరాబాద్: 'అష్టా చెమ్మ' చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'అంతకు ముందు... ఆ తరువాత' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం కాన్సెప్టు టైటిల్ ని జస్టిఫై చేస్తుందని, నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు.

    ఈ విషయమై మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.... ప్రేమలో గెలవడం ఒక ఎత్తయితే... ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసాని ఎదుటి వ్యక్తిలో కల్పించినప్పుడే అది నిలబడుతుంది. నవతరం ఆ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తున్నారు? వారిలో ఉన్న చిన్నపాటి గందరగోళానికి కారణమేమిటి? ఓ జంట ప్రేమలో పడటానికి ముందు ఎలా ఉంటుంది?, ఆ తర్వాత ఎలా మారిపోతుంటుంది? అనే విషయాల్ని మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యువతరం ఆలోచనలు ఏ రీతిన ఉంటున్నాయో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

    ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకొంది. రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఎస్‌.రవీందర్‌, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

    English summary
    ‘Ashta Chemma’ fame Mohan Krishna Indraganti is now directing new movie titled ‘Anthaka Mundhu Aa Tharuvatha’. MS Raju’s son Sumanth Aswin is going to play the lead role in this film, which made his debut with Tuneega Tuneega movie. A new comer Isha is acting as heroine in the film. The movie is produced by Damodar Prasad who had earlier produced ‘Ala Modhalaindi’ movie and music is given by Kalyani Malik. More details are awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X