25న‘ అంతకు ముందు ఆ తరువాత’ ఆడియో

By Bojja Kumar

హైదరాబాద్ : 'శ్రీ రంజిత్ మూవీస్' పతాకంపై సుమంత్ అశ్విన్, ఈషా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'అంతకుముందు ఆ తరువాత'. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి కల్యాణి కోడూరి వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు. 'అలా మొదలైంది' లానే ఈ చిత్రం ఆడియో కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది అన్నారు, చిత్ర దర్శక, నిర్మాతలు. సుప్రసిద్ధ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాంలు ఈ గీతాలను రచించారు. తన సంగీత ప్రయాణంలో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి.

'అంతకుముందు ఆ తరువాత' ఓ ఉద్వేగభరిత ప్రేమ కధా చిత్రం' అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమే ఈ చిత్రం అన్నారాయన. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో రవిబాబు, రావురమేష్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్, పమ్మి సాయి, కె.ఎల్.ప్రసాద్, రోహిణి, మధుబాల, ప్రగతి, ఝాన్సీ, సుదీప, మాధవి, స్నిగ్ధ, అర్చన, అపర్ణ శర్మ నటిస్తున్నారు.

సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయినీ గాయకులు: సునీత, హేమచంద్ర, కల్యాణి కోడూరి, స్రవంతి, శ్రీకృష్ణ, కాలభైరవ, కోగంటిదీప్తి, కెమెరా: పి.జి.వింద, ఎడిటింగ్ : మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్ : ఎస్.రవీందర్, నృత్యాలు : నోబుల్, సుచిత్ర, పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, భరత్ , మేకప్ : మోహన్, పబ్లిసిటి డిజైనర్: ఆర్.విద్యాసాగర్, ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.శ్రీనివాసరాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ, ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి, సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి, నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X