'అంతకు ముందు... ఆ తరువాత' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: 'అష్టా చెమ్మ' చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజాగా 'అంతకు ముందు... ఆ తరువాత' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సుమంత్ అశ్విన్ హీరోగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ చిత్రం కాన్సెప్టు టైటిల్ ని జస్టిఫై చేస్తుందని, నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని దర్శకుడు చెప్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో తన కుమారుడు సుమత అశ్విన్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ తీసిన సినిమా' తూనీగా తూనీగా'. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాదించలేదు కానీ సుమంత్ అశ్విన్ మాత్రం తన నటనకు మరియు తన డాన్సులకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అతనే ఈ చిత్రం లో హీరో కావటంతో మంచి క్రేజే వచ్చింది.

మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.... ప్రేమలో గెలవడం ఒక ఎత్తయితే... ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసాని ఎదుటి వ్యక్తిలో కల్పించినప్పుడే అది నిలబడుతుంది. నవతరం ఆ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తున్నారు? వారిలో ఉన్న చిన్నపాటి గందరగోళానికి కారణమేమిటి? ఓ జంట ప్రేమలో పడటానికి ముందు ఎలా ఉంటుంది?, ఆ తర్వాత ఎలా మారిపోతుంటుంది? అనే విషయాల్ని మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యువతరం ఆలోచనలు ఏ రీతిన ఉంటున్నాయో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది''అన్నారు. రవిబాబు, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఎస్.రవీందర్, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.


Click it and Unblock the Notifications











