twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్ డబుల్ ధమాకా.. హీరోయిన్‌తో రొమాన్స్, వెంకీతో చిందులు!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ మంచి ట్రాక్ లోనే సాగుతోంది. వరుణ్ తేజ్ నటుడిగా ఎప్పుడో నిరూపించుకున్నాడు. కంచె లాంటి చిత్రాల్లో వరుణ్ నటనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఫిదా చిత్రంతో వరుణ్ తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతరిక్షం, ఎఫ్2 లాంటి క్రేజీ చిత్రాల్లో వరుణ్ నటిస్తున్నాడు. దీపావళి సందర్భంగా అభిమానులకు వరుణ్ డబుల్ ధమాకా అందించాడు.

     అంతరిక్షం ఉత్కంఠభరితంగా

    అంతరిక్షం ఉత్కంఠభరితంగా

    ఘాజి చిత్రంతో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఆసక్తికర చిత్రం అంతరిక్షం. ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్పేస్ సైన్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉత్కంఠ భరింతగా ఉండబోతోంది. అంతరిక్షంలో వరుణ్ చేసే సాహసాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంది.

    అంతరిక్షంలో రొమాన్స్

    అంతరిక్షం చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. టీజర్ లో అదితి రావు హైదరి వ్యోమగామిగా కనిపించింది. లావణ్య త్రిపాఠి కనిపించలేదు. దీపావళి సందర్భంగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఉన్న రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేశారు.

    వెంకీతో చిందులు

    అంతరిక్షం వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం. మరో వైపు వరుణ్ ఎఫ్2 అనే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ క్రేజీ మల్టీస్టారర్ లో వెంకటేష్, వరుణ్ హీరోలు. దీపావళి సందర్భంగా వెంకీ, వరుణ్ కూలీల గెటప్ లో ఉన్న పోస్టర్ విడుదల చేశారు.

    ఈ రెండు చిత్రాలు

    ఈ రెండు చిత్రాలు

    అంతరిక్షం చిత్రం డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2 సందడి సంక్రాంతికి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో వెంకీ , వరుణ్ తోడల్లుళ్లుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Posters release from Anthariksham, F2 movies. Anthariksham will release in December and F2 for Sankranti
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X