చిక్కుల్లో పడ్డ 'సీత'.. దీనికి తోడు ఎన్నికల ఫలితాల ప్రభావం.. మరో సమస్య
అసలే టైటిల్ విషయంలో చిక్కుల్లో పడి కొట్టుకుంటున్న సీతపై ఎలెక్షన్స్ ప్రభావం కూడా పడిందట. సినిమా రాబోతుందనగానే ముందులాగానే ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం.. ఆపై థియేటర్స్ లో వాలిపోవడం నేటితరం ప్రేక్షకుల తీరు. అయితే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఉండటంతో సీత విషయంలో అలా జరగలేదని తెలుస్తోంది. ఈ మేరకు ఇది కల్లెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మే 24 వ తేదీన సీత విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ ముందుగానే టికెట్లను అందుబాటులో ఉంచాయి. కానీ అవి బుక్ చేసుకునే నాధుడే లేక ఆన్ లైన్ ప్లేట్ ఫార్మ్స్ అన్నీ బోసిపోయాయని అంటున్నారు వాటి నిర్వాహకులు. ఈ సినిమా శుక్రవారం నాడు రిలీజ్ కి రెడీ అవుతుంటే ప్రీబుకింగ్స్ రూపంలో ఇలా పెద్ద పంచ్ పడింది. సీత సినిమాకి టిక్కెట్ విండో వద్ద ఊహించినంత ఊపు లేదని ఆన్ లైన్ టికెటింగ్ వారు చెబుతున్న మాట. అయితే ఇందుకు కారణం ప్రస్తుతం అందరూ ఎలక్షన్ రిజల్ట్ మూడ్ లో ఉండటమే అని తెలుస్తోంది. ఫలిత విషయమై ఆసక్తిగా ఎదురుచూసిన వారు సీతను మర్చిపోయారు. అలా ఫలితాల ఆ ప్రభావం సీతపై పడింది. అయితే ఒకవేళ రిలీజై హిట్టు అనే టాక్ వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది.

తేజ దర్శకత్వంలో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీత రూపుదిద్దుకుంది. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు, సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ రేంజ్ అంచనాల నడుమ మే 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











