twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లో మాఫియా డబ్బు: పోలీసులు, పైరసీ అప్లికేషన్ రిలీజ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలోకి మాఫియా ఎంటరైందా? అక్రమంగా సంపాదించిన సొమ్మును సినిమాల్లో పెట్టుబడిగా పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర పోలీసులు. తెలుగు సినీ పరిశ్రమలో పెట్రేగిపోతేన్న పైరసీ భూతంపై ఆదివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్లో మాఫియా కార్యకలాపాలను వెల్లడించారు పోలీసులు.

    ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు నష్టం కలిగించడమే కాకుండా సంఘవిద్రోహ శక్తులకు కాసులు కురిపిస్తున్న పైరసీని అరికట్టేందుకు అంతా సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన యాంటీ పైరసీ మొబైల్ అప్లికేషన్‌ 'ఇండియన్ మూవీ కాప్(IMC)'ను భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ జేపావెల్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ అప్లికేషన్‌ను అందరూ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పైరసీ సమాచారం అందించడానికి, అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది.

    పైరసీ కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఏటా 5.72 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, రూ. 5400 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని నాన్సీ తెలిపారు. డాక్టర్ డి. రామానాయుడు, శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి 120 సినిమాలు నిర్మిస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ వల్ల వేల కోట్ల రూపాయాల నష్టం వాటిల్లు తుందని, అనేక థియేటర్లు మూత పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. పైరసీ సమాచారం అందిస్తే బహుమతి ఇస్తామని రమేష్ ప్రసాద్ అన్నారు.

    పైరసీ సొమ్ము మాఫియా చేతుల్లోకి వెళ్లి తిరిగి సినిమా రంగంలోకి పెట్టుబడి రూపంలో వస్తోందని సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆరేవేల రైట్స్ చేసి 4 వేల మందిని అరెస్టు చేసామని, అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేక పోవడం వల్ల శిక్షలు తక్కువగా పడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో రాజమౌళి, దిల్ రాజు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Director-general of police V Dinesh Reddy on Sunday said rogue elements were using money raised from video piracy to fuel anti-social activities in India. He was speaking after the launch of the anti-piracy mobile phone application 'Indian Movie Cop' (IMC) here on Sunday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X