యాంటీ వాలెంటైన్స్ డే

మరోవైపు భాగ్యనగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా బజరంగ్‌దళ్, విహెచ్‌పి నాయకులను బోయిన్‌పల్లి సిఐ గణేష్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వాలంటైన్స్ డేకు వ్యతిరేకంగా బిజెవైఎం కార్యకర్తలు ముఖానికి నల్లగుడ్డలు ధరించి తిరుపతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలన్నీ భారతీయ సంస్కృతి వైపు మొగ్గుచూపుతుంటే, నేటి యువత విదేశీ సంస్కృతి వైపు మొగ్గుచూపటం విచారకరమని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రేమ పేరుతో పెడదోవ పడుతున్న యువత సమాజం గూర్చి ఆలోచించాలని కోరుతూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ యాంటీ వాలెంటైన్స్ డే ర్యాలీని నిర్వహించింది. ప్రేమ అనే ఆకర్షణతో ఆత్మహత్యలు, హత్యలు, యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారని, వీటిని యువకులు వ్యతిరేకించాలని ప్రచారం చేశారు. ప్రేమికుల రోజును యాంటీ వాలెంటేన్స్ డే గా ప్రకటించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటామన్న శ్రీరామ్ సేన వ్యవస్దాపకుడు ముతాలిక్‌ను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలంటైన్ డే రోజున అల్లర్లు చెలరేగకుండా ముతాలిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











