అజ్ఞాతవాసిపై ఆశలు పెట్టుకున్నా, బన్నీతో డాన్స్ చేయగలనా.. అను ఇమ్మాన్యుయేల్!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటించిన చిత్రం ఇది. శుక్రవారం మే 4 న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలవుతోంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆర్మీ అధికారిగా బన్నీ నటన కట్టిపడేయడం ఖాయం అనే అంచనాలు నా పేరు సూర్య చిత్రంఫై ఉన్నాయి.
తొలిసారి దర్శకుడిగా మారిన వక్కంతం వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో, మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రాన్ని సమర్పించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ తాజా ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

నా అదృష్టం
టాలీవుడ్ కి వచ్చిన తక్కువ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వచ్చిందని అను తెలిపింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడం అదృష్టం అని తెలిపింది.

అజ్ఞాతవాసిపై ఆశలు
పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై చిత్రంపై అసలు పెట్టుకున్నానని కానీ ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో చాలా నిరాశచెందానని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. కానీ పరాజయాలు ఎదురైనప్పుడే విజయాలు కూడా దక్కుతాయని ధైర్యం వచ్చిందని అను తెలిపింది.

స్టూడెంట్ రోల్‌లో నటించా
ఈ చిత్రంలో తాను వర్ష అనే ఆర్ట్స్ స్టూడెంట్ గా కనిపిస్తానని అను తెలిపింది. విహార యాత్రకు వెళ్ళినపుడు ఆర్మీ అధికారిగా ఉన్న బన్నీ వర్షని కలుస్తాడని తెలిపింది. అభిమానుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానని అను తెలిపింది.

అల్లు అర్జున్‌తో డాన్స్ చేయగలనా
ఈ చిత్రంలో అవకాశం వచ్చినపుడు తనకు మొదట ఓ సందేహం వచ్చిందని, అల్లు అర్జున్ తో నేను డాన్స్ చేయగలనా అనే అనుమానం కలిగిందని అను చెప్పుకొచ్చింది. ఇరగ ఇరగ అనే సాంగ్ లో తాను వేసిన స్టెప్పులు కష్టంగా ఉండవని కానీ అల్లు అర్జున్ కు సరితూగేలా ఎప్పటికి డాన్స్ చేయలేనని తెలిపింది.

ఆ సన్నివేశం గురించి ఇప్పుడే చెప్పను
నా పేరు సూర్యలో ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సన్నివేశం చిత్రీకరిస్తున్నపుడు నాకు హాలీవుడ్ సన్నివేశం ఫీలింగ్ కలిగింది. ఆ సన్నివేశం గురించి ఇప్పుడే చెప్పను అంటూ ఊరించింది.


Click it and Unblock the Notifications











