పవన్ కల్యాణ్ రియల్ పవర్ ఇది.. ఫోటో తీసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
పవన్ కళ్యాణ్ పేరులోనే ఓ పవర్ ఉంటుంది. అందుకే ఆయనను పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొంటారు. కేవలం ఆ మాట ఫ్యాన్స్‌కే కాదు.. తోటి నటీనటులు కూడా పవర్‌స్టార్‌కు వీరాభిమానులు అవుతారు అనే విషయం తాజాగా ఓ సంఘటన రుజువు చేసింది. అదేమింటంటే..

ఫారిన్‌లో పవన్ సినిమా షూటింగ్
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫారీన్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో ఆయన సరసన అందాల తార అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా కారులో ప్రయాణిస్తుండగా వెనుక సీట్లో నుంచి పవన్ కల్యాణ్ కళ్లను కెమెరాలో బంధించింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో పవన్ ఫొటో
పవన్ కల్యాణ్ ఫోటోను అను ఇమ్మాన్యుయేల్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. కేవలం అలా పోస్ట్ చేయకుండా పవర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేసి తన అభిమానాన్ని చాటుకున్నది.

వైరల్‌గా మారిన పవన్ ఫొటో
అను పోస్ట్ చేసిన పవన్ కల్యాన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ ఫొటోకు 28 వేల లైకులు రాగా, చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

అజ్ఞాతవాసి అనే టైటిల్ చక్కర్లు
పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ సినిమా సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి అజ్ఞాతవాసి అనే టైటిల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే త్వరలోనే ఈ టైటిల్‌ను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

వచ్చే సంక్రాంతికి పవన్ సినిమా
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కూడా మరో కథానాయికగా నటిస్తున్నది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











