పవన్‌ను చూడగానే మైండ్ బ్లాంక్.. ఆయన పక్కన నటించడం గొప్ప వరం
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించడం అంటే యువ హీరోయిన్లకు పండుగే. అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న వారిలో అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్
Recommended Video

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించడం అంటే యువ హీరోయిన్లకు పండుగే. అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న వారిలో అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న పీఎస్‌పీకే25 చిత్రంలో ఆమె నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అను నటించిన ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో అను మీడియాతో మాట్లాడుతూ.. ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను వెల్లడించారు. అను చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రం
ప్రస్తుతం గోపిచంద్‌తో నేను నటించిన ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాను. అలాగే పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రం చేస్తున్నాను అని అను ఇమ్మాన్యుయేల్ వెల్లడించింది.

పవన్‌ను చూడగానే మైండ్ బ్లాంక్
పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం రావడంపై అను ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ సార్‌తో సినిమా తొలిరోజు షూటింగ్ సమయంలో చాలా భయపడ్డాను. ఆ రోజు ఓ రొమాంటిక్ సీన్‌ను చిత్రీకరించారు. నేను ముందుగానే డైలాగ్స్ అన్నీ మైండ్‌లో ఫీడ్ చేసుకొన్నాను. కానీ అతడిని చూడగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది.

పవన్ ఎప్పుడూ కూల్‌గా
పవన్ దగ్గరికి రాగానే నేను చెప్పాల్సిన డైలాగ్స్ అన్నీ మరిచిపోయాను. పవన్ కల్యాణ్ ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటాడు. షూటింగ్ గ్యాప్‌లో జోకులు వేస్తూ సరదాగా ఉంటాడు. కెరీర్ ఆరంభంలోనే పవన్‌తో నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టం అని అను ఇమ్మాన్యుయేల్ చెప్పింది.

దేవుడు ఇచ్చిన గొప్ప వరం
పవన్ కల్యాణ్ పక్కన నిలబడే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. చాలా మంది పవన్‌తో నటించేందుకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ నాకు ఆ అవకాశం రావడం నిజంగా లక్కీనే అని అను అన్నారు.

మలయాళ చిత్రంలో
ప్రస్తుతం నాగ చైతన్య నటించే చిత్రాన్ని అంగీకరించాను. ఇంకా ఆ చిత్రానికి పేరు పెట్టలేదు. తెలుగు సినిమాల షూటింగ్‌లు పూర్తి కావొచ్చాయి. త్వరలో ఓ మలయాళ చిత్రంలో నటించనున్నాను. తమిళంలో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. వాటిని ఇంకా అంగీకరించలేదు అని అను ఇమ్మాన్యుయేల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











