ఇలా చూపిస్తే...ఎంతటి పోటుగాడైనా బోల్డే! (సెక్సీ పిక్చర్స్)

By Bojja Kumar

హైదరాబాద్ : హీరో మంచు మనోజ్ త్వరలో 'పోటుగాడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హీరోయిన్లలో ఒకరైన అను ప్రియా తన అందం ముందు ఎంతటి పోటుగాళ్లయినా బోల్డ్ కావాల్సిందే అంటూ....అందచందాలతో టెంమ్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా విడుదలైన అనుప్రియ గ్లామరస్ హాట్ ఫోటోలు.....కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని అను ప్రియ ఈ హాట్ ఫోటో షూట్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మరి సినిమా విడుదలైన తర్వాత ఇంకెంత మంది పోటుగాళ్లను బోల్డ్ చేస్తుందో చూడాలి.

అను ప్రియా హాట్ ఫోటోలతో పాటు, పోటుగాడు సినిమా వివరాలు స్లైడ్ షోలో.....

పోటుగాడు

పోటుగాడు

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు' . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌ వడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

కన్నడ రీమేక్

కన్నడ రీమేక్

ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 'పోటుగాడు' చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తారు. ‘పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఇప్పటికే ఈ సాంగు రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

నలుగురు హీరోయిన్లు

నలుగురు హీరోయిన్లు

సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె. ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి సంగీతం: చక్రి, అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీ్ధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో అదే దర్శకుడితో నిర్మిస్తున్నామని, యూనిట్ అంతా కలిసి ఈ చిత్రా న్ని తమ చిత్రంగా భావించి పనిచేశారని, ముఖ్యం గా మనోజ్ ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తాడని తెలిపారు.

మనోజ్ మాట్లాడుతూ...

మనోజ్ మాట్లాడుతూ...

మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం ‘పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X