దొరికిపోయిన అనుదీప్.. ఆ సీన్స్‌ను అక్కడి నుంచి లేపేశాడు.. ‘జాతిరత్నాలు’పై ట్రోల్స్
టాలీవుడ్‌కు ఈ ఏడాదిలో మంచి హిట్లు పడుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే గత నెల నుంచి మాత్రం బాక్సాఫీస్ వద్ద జాతి రత్నాలు సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికీ జాతి రత్నాలు నిలకడగా కలెక్షన్లను రాబడుతోంది. దీని తరువాత వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొడుతుండటంతో జాతి రత్నాలు పైపైకి వెళ్తోంది.

జాతి రత్నాలు అలా..
అనుదీప్ వెండితెరపై ఇప్పుడు ఫేమస్ అయ్యాడు. జాతి రత్నాలు సినిమాతో దర్శకుడిగా అనుదీప్‌కు ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. కానీ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో అనుదీప్ నెటిజన్లకు సుపరిచితుడే. ఎప్పుడో వచ్చిన తన షార్ట్ ఫిలిమ్స్‌లోని సీన్స్‌ను జాతి రత్నాలులో పెట్టేశాడు.

ఆ సీన్స్ కాపీ అంటూ..
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్రోలింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో జాతి రత్నాలులోని కొన్నీ సీన్లు ఎక్కడి నుంచి లేపేశాడో క్లియర్ కట్‌గా చూపించారు. శవాన్ని పక్కన పెట్టుకుని కూడా కర్రీలు, రైస్ అని మాట్లాడుకోవడం, హీరో హీరోయిన్లు ప్రపోజ్ చేసుకునే సీన్లను కాపీ కొట్టాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
జబర్దస్త్ షో..
జబర్దస్త్ షోలో సుధీర్, ఆటో రాంప్రసాద్ ఓ స్కిట్ వేశారట. అందులోని సీన్, డైలాగ్స్‌ను ఉన్నది ఉన్నట్టుగా వాడేశాడట అనుదీప్. అప్పటి వీడియో, కర్రీ, రైస్ అంటూ రాం ప్రసాద్ వేసిన పంచ్‌లను వీడియోలో చూపించారు. ఇక లవ్ సీన్‌ను మరో చిత్రం నుంచి కాపీ చేశారంటూ చెప్పుకొచ్చారు.

ప్రపోజ్ సీన్..
ఒకటి చెప్పాలి.. ఏం అనుకోవు కదా? అని హీరో అనడం... ఏం అనుకోని అని పదే పదే చెప్పమని అంటున్నా అంటూ నా మనసులో ఏముందో తెలియడం లేదా? అని హీరోయిన్ అనే ఈ సీన్ జాతి రత్నాలు సినిమాలో బాగానే పండింది. కానీ సేమ్ సీన్, సేమ్ డైలాగ్స్‌తో ఆల్రెడీ ఓ సినిమాలో(2017లో వచ్చిన నేను మీ కళ్యాణ్ అనే చిత్రం) ఉందట. అలా మొత్తంగా వీడియో ద్వారా అనుదీప్‌ను ట్రోల్ చేసి పడేస్తున్నారు. భళే మోసం చేశారు మావా అంటూ సెటైర్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











