షాకిచ్చిన అనుపమ్ ఖేర్.. ఏడాదిలోపే తప్పుకొని..
బాలీవుడ్‌లో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన పదవికి రాజీనామా చేశారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ)కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సినిమా ప్రాజెక్టుల కారణంగా తన పదవికి రాజీనామా చేసినట్టు అనుపమ్ ఖేర్ వెల్లడించారు.
ఎఫ్‌టీఐఐకి చైర్మన్‌గా వ్యవహరించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఆ పదవిలో గొప్ప అనుభవం లభించింది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రాజెక్టులను అంగీకరించాను. అందుచేత ఈ సంస్థకు సమయం కేటాయించలేకపోతున్నా. కావును నేను నా పదవికి రాజీనామా చేస్తున్నా అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

ఎఫ్‌టీఐఐకి చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో అనుపమ్ ఖేర్‌ను గతేడాది నియమించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సుమారు 500 చిత్రాలకుపైగా నటించిన అనుపమ్ ఖేర్ అమెరికాలో న్యూ అమ్‌స్టర్ డ్యామ్ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.


Click it and Unblock the Notifications











