For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసలు ఎవరీ అనుపమ పరమేశ్వరన్? ఎందుకింత క్రేజ్? : ఆశ్చర్యపరిచే నిజాలతో అదిరిపోయే ఫొటోలు

  By Srikanya
  |

  హైదరాబాద్: అ..ఆ చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ లాంచ్ అయిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా విజయంలో ఈమెదీ కీలకమైన పాత్రే. దాంతో అందరి దృష్టీ ఈ మళయాళి బ్యూటీ పై పడింది. ఆమెను పలు ప్రొడక్షన్ కంపెనీలు సంప్రదిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ని దిల్ రాజు తన తాజా చిత్రం కోసం తీసుకున్నారు.

  శర్వానంద్ హీరోగా దిల్ రాజు రూపొందిస్తున్న శతమానం భవతి చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. శర్వానంద్ కు హీరోయిన్ గా ఆమె ఈ చిత్రంలో కనిపించనుంది. సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

  అనుపమ పరమేశ్వరన్‌ మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్‌. ఇప్పుడు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా విడుదలైన 'అ ఆ' చిత్రంలో నాగవల్లిగా అందంగా కనిపించింది. అంతేకాదు సినిమా చూసిన వాళ్లందరూ ఈ అమ్మాయి భలే చేసింది అంటూ ప్రశంసించారు.

  ఇప్పుడు నాగచైతన్యతో సరసన మలయాళ రీమేక్‌ 'ప్రేమమ్‌'లో నటిస్తోంది. మరో రెండు తెలుగు, ఒక తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకుందీ మలయాళీ భామ. అసలు కెరీర్ ప్రారంభం ఎలా మొదలైందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఆ విశేషాలు మీరు క్రింద చదవవచ్చు.

  అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలులో స్లైడ్ షో

  జననం

  జననం

  అనుపమ పరమేశ్వరన్‌ 1996 ఫిబ్రవరి 18వ తేదీన కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుండలో జన్మించింది.

  గ్రాడ్యుయేషన్

  గ్రాడ్యుయేషన్

  అనుపమ ప్రస్తుతం కొట్టాయమ్‌లో కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది.

  మోడల్ గా కెరీర్

  మోడల్ గా కెరీర్

  ఒక పక్క డిగ్రీ చేస్తూనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

  కెరీర్ మొదలు

  కెరీర్ మొదలు

  ప్రేమమ్ తొలి సినిమానే కాని, మళయాళ టీవి వీక్షకలుకు ఆమె ఫెమిలియర్ ఫేసు, అక్కడ టీవిషోలు, సెలబ్రెటీ ఛాట్ షోస్, రియాల్టిషోలు చేసింది.

  ఆఫర్

  ఆఫర్

  ఓ ప్రకటనలో ఈమె ఫొటోను చూసిన దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుతరెన్‌ తన చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.

  తొలి చిత్రం

  తొలి చిత్రం

  ఆల్ఫోన్స్‌ పుతరెన్‌ దర్శకత్వంలో మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'లో మొదట సారిగా నటించింది అనుపమ.

  అదరకొట్టింది

  అదరకొట్టింది

  మొదటి చిత్రమైనా ఓ అనుభవం ఉన్న నటిలా ఒదిగిపోయింది. పరమేశ్వరన్‌ నటనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు.

  తొలి చిత్రంతోనే

  తొలి చిత్రంతోనే

  ఆ చిత్రం దక్షిణాది చలన చిత్రాలకు అందించే ప్రతిష్టాత్మక అవార్డు 'సిమా'కు నామినేట్‌ అయింది కూడా.

  హండ్రెడ్ డేస్

  హండ్రెడ్ డేస్

  ఈ రోజుల్లో ఈ చిత్రం ఏకంగా వంద రోజులు ఆడి సంచలనం సృష్టించింది.

  మెచ్యూరిటీ

  మెచ్యూరిటీ

  డిగ్రీ విద్యార్థిని అయిన అనుపమ చాలా జాగ్రత్తగా అవకాశాలపై సరైన నిర్ణయాలు తీసుకుంటూ మెచ్యూరిటీ చూపిస్తోంది.

  మార్చుకోవాల్సి వచ్చింది

  మార్చుకోవాల్సి వచ్చింది

  ''నేను ప్రస్తుతం నా చదువుతో బిజీగా ఉండిపోతున్నాను. కానీ 'ప్రేమమ్‌' చిత్రం చేశాక నన్ను నేను చాలా మార్చుకోవాల్సి వస్తోంది. ఆ క్రమంలో రోజూ మారుతూనే ఉన్నాను'' అని చెప్పింది అనుపమ.

  జీవన విధానం

  జీవన విధానం

  ఇక నుంచి సినిమాల్లో నటించేందుకు, నటిగా మారేందుకు గాను నా జీవన విధానమే మార్చాల్సి ఉంది

  దూర విద్య

  దూర విద్య

  ''నా కెరీర్‌ కోసం నా చదువును ఆపేయాలనుకుంటున్నాను. ఇక నుంచి రెగ్యులర్‌గా క్లాస్‌కు హాజరుకావడం సాధ్యం కావడం లేదు. అందుకని దూరవిద్యలో విద్యనభ్యసించడానికి ప్రయత్నిస్తా'' అని పేర్కొంది.

  పాత్ర పేరునే

  పాత్ర పేరునే

  విద్యార్థిని అవడం వల్ల సినిమా హిట్టయ్యాక ఆమె ఎక్కడకెళ్లినా మేరీ (ప్రేమమ్‌ సినిమాలో పాత్ర పేరు) అనే పిలిచేవారు.

  స్వేచ్చ

  స్వేచ్చ

  ఒకానొక దశలో తాను స్వేచ్ఛ కోల్పోతున్నాను అని కూడా భావించిన సందర్భాలు అనుపమకు వచ్చాయంటే ఆమె నటనకు ఎంత అభిమానం పెరిగిందో అర్థమవుతుంది.

  ఇక్కడ మంచి డిమాండ్

  ఇక్కడ మంచి డిమాండ్

  మలయాళీ ముద్దుగుమ్మలకు తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి. తన కొత్త సినిమాల్లో హీరోయిన్ కావాలంటే మళాయళం వైపు తమిళ,తెలుగు సినీ పరిశ్రమలు చూస్తున్నాయి.

  తెలుగులో మీకు నచ్చిన ఇద్దరు హీరోలు గురించి చెప్పమంటే?

  తెలుగులో మీకు నచ్చిన ఇద్దరు హీరోలు గురించి చెప్పమంటే?

  ఒకరు పవన్‌కల్యాణ్‌, మరొకరు మహేష్‌బాబు. అంత పెద్ద హీరో అయినా పవన్‌కల్యాణ్‌ ఎంత వినయంగా కనిపిస్తారో! ఆయన్ని తొలిసారి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను.

  ఫ్యాన్ ని

  ఫ్యాన్ ని

  ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల సినిమాల్ని చూడలేదా?

  ఎందుకు చూడలేదు? చాలా సినిమాలు చూశా. వాళ్లిద్దరి డ్యాన్స్‌కి నేను అభిమానిని.

  తెలుగులో ‘ప్రేమమ్‌'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

  తెలుగులో ‘ప్రేమమ్‌'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

  మలయాళం ‘ప్రేమమ్‌'లో చేసిన పాత్రనే ఇక్కడా చేశా. ఆ చిత్రంతోనూ నాకు తెలుగులో మరో విజయం ఖాయం. ఒదిగి ఉండే మనస్తత్వమున్న నాగచైతన్యతో కలిసి తెరను పంచుకోవడం సంతృప్తినిచ్చింది.

   తెలుగులో కొత్తగా ఒప్పుకొన్న సినిమాలేమున్నాయి?

  తెలుగులో కొత్తగా ఒప్పుకొన్న సినిమాలేమున్నాయి?

  ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించే పాత్రల కోసం ఎదురు చూస్తున్నా.

   మీకు వంట చేయడం వచ్చా?

  మీకు వంట చేయడం వచ్చా?

  వండి పెడితే తినడం వచ్చు (నవ్వుతూ). వంటింట్లోకి దూరి ప్రయోగాలు చేసే అవసరం ఇంకా రాలేదు.

  ఇష్టంగా తినేవి?

  ఇష్టంగా తినేవి?

  అమ్మ చేసిన ఏ వంటకమైనా ఇష్టమే.

  మీ హాబీలేంటి?

  మీ హాబీలేంటి?

  బోలెడన్ని ఉండేవి. సినిమాల్లోకి వచ్చాక వాటన్నిటినీ కోల్పోయా.

  వ్యక్తిగతంగా ‘ప్రేమమ్‌' విషయాలేమైనా ఉన్నాయా?

  వ్యక్తిగతంగా ‘ప్రేమమ్‌' విషయాలేమైనా ఉన్నాయా?

  స్కూల్‌ రోజుల్లో ఆకర్షణతో కూడిన ప్రేమకథలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తలచుకొంటే నవ్వొస్తుంది.

  ఇంకో సినిమా

  ఇంకో సినిమా

  రవితేజ నటించనున్న 'ఎవడో ఒకడు' చిత్రంలో కూడా అనుపమ ఒక హీరోయిన్‌. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌, ఈమె హీరోయిన్లు.

  ఆమెను చూసాక

  ఆమెను చూసాక

  ధనుష్‌ ద్విపాత్రాభినయం చేసిన 'కోడి' చిత్రం కోసం మొదట హీరోయిన్ సమ్లీని అనుకున్నారు. కానీ, ధనుష్‌ 'ప్రేమమ్‌' చిత్రం చూసిన తర్వాత అనుపమను ఆమె స్థానంలో మార్పు చేశారు. త్రిషతో ఈమె కలసి ఈ చిత్రం ముఖ్య పాత్ర పోషించింది.

  మొదట అనుకున్నా..

  మొదట అనుకున్నా..

  ఇటీవల తమిళ హీరో కార్తిక్‌తో మణిరత్నం ఓ చిత్రం తీయడానికి నిర్ణయించుకుని అందులో అనుపమను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మొదట కథ చెప్పినప్పుడు పాత్ర బాగుందని నటించేందుకు పరమేశ్వరన్‌ అంగీకరించింది.

  మణికు నో

  మణికు నో

  కొద్ది రోజుల తర్వాత మణిరత్నం ఫోన్‌ చేసి ''స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. మీ పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుంది'' అని అనుపమతో చెప్పారట. ఇటువంటి పాత్రలు తాను చేయనని చెప్పేసింది.

  తెలుగు మాటలు పలకడం ఇబ్బందిగా అనిపించిందా?

  తెలుగు మాటలు పలకడం ఇబ్బందిగా అనిపించిందా?

  ఇక్కడికొచ్చే ముందు నేను తెలుగు నేర్చుకొన్నానండీ. ఎంత నేర్చుకొన్నానంటే ‘నాకు తెలుగు తెలియదు' అని చెప్పేంత నేర్చుకొన్నా (నవ్వుతూ). అది చాలు కదా, మేనేజ్‌ చేయడానికి!

  ప్రాక్టీస్ చేసా

  ప్రాక్టీస్ చేసా

  నిజం చెప్పాలంటే నేను ట్యూటర్‌ని కూడా పెట్టుకోలేదు. ఏ పదాన్ని ఎలా పలకాలో సెట్‌లోనే నేను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్‌ చేశాను. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు మరికొన్ని జాగ్రత్తలు తీసుకొన్నానంతే. తెలుగు పలికే విషయంలో నేనేం పెద్దగా ఇబ్బంది పడలేదు.

  త్రివిక్రమ్‌ గురించి

  త్రివిక్రమ్‌ గురించి

  ఆయన్నుంచి బోలెడంత నేర్చుకొన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే త్రివిక్రమ్‌గారు ఎన్‌సైక్లోపీడియా. ఏ విషయం గురించైనా మాట్లాడతారు. ‘అఆ'తో నితిన్‌, సమంతలతో కలిసి పనిచేయడాన్ని కూడా చాలా ఆస్వాదించా.

  ఇక్కడ అలవాటు పడ్డా

  ఇక్కడ అలవాటు పడ్డా

  ఎప్పుడో. అయినా... తెలుగు సినిమా వాతావరణం నాకేం కొత్తగా ఏమీ అనిపించడం లేదు. పరిసరాలు కొత్తగా అనిపిస్తున్నాయి తప్ప పని విషయంలో మాత్రం ఒకటే అనుభవం. ఇక్కడ చేసిన తొలి సినిమాకి వచ్చిన స్పందనని చూశాక మాత్రం తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనిపిస్తోంది.

   ఫెరఫార్మెన్స్ తోనే

  ఫెరఫార్మెన్స్ తోనే

  నిత్యమీనన్, మాళవిక నయ్యర్, ఇప్పుడు అనుపరమేశ్వరన్ పేరేదైనా పర్ఫర్మెన్స్‌లో వీరిదే పైచేయి.

  ఈ సినిమాతో వెలుగు

  ఈ సినిమాతో వెలుగు

  మలయాళ చిత్రం ‘ప్రేమమ్' సినిమాతో వెలుగులోకొచ్చింది బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. ఆ సినిమా ఘన విజయం తో అందరి దృష్టీ ఆమెపై పడింది.

  వెంటనే త్రివిక్రమ్

  వెంటనే త్రివిక్రమ్

  ఈమె ప్రతిభని గుర్తించిన త్రివిక్రమ్ ‘అ..ఆ..' సినిమాలో అవకాశమిచ్చి తెలుగులోకి ఎంట్రీ కార్డు ఇచ్చేశారు.

  చైతూ సినిమాలోనూ...

  చైతూ సినిమాలోనూ...

  నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రేమమ్'లోనూ నటిస్తోంది.

  కుర్ర హీరోలందరికీ

  కుర్ర హీరోలందరికీ

  తమ సినిమాలో అనుపమ కావాలని ఇప్పుడు యంగ్ హీరోలంతా కోరుకుంటున్నారు

  ప్రేమ, బ్రేకప్

  ప్రేమ, బ్రేకప్

  ఈ అమ్మాయి ఇప్పటికే ప్రేమలో పడటం, బ్రేకప్ అవటం జరిగిపోయాయట. అయితే ప్రేమ మీద నమ్మకం మాత్రం పోలేదట.

  డబ్బింగ్ తానే..

  డబ్బింగ్ తానే..

  తొలి సినిమాతోనే డబ్బింగ్‌ కూడా చెప్పేసుకొని నిజంగా..ఆ...ఆ లో డైలాగు చెప్పినట్లు అమ్మోరు కత్తి అనిపించుకుంది.

  ఆ ధైర్యంతోనే..

  ఆ ధైర్యంతోనే..

  త్రివిక్రమ్‌గారి ప్రోత్సాహం, నా ఆత్మవిశ్వాసంవల్లే అది సాధ్యమైంది. ‘తక్కువ సంభాషణలే ఉన్నాయి కదా, నువ్వు చెప్పేసేయ్‌... చూద్దాం' అన్నారాయన. దీంతో నేను ధైర్యం చేశా.

  అదే కల

  అదే కల

  తెలుగు చిత్రసీమలోనే ఓ మంచి నటిగా రాణించాలన్నది ఈమె కల అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

  Read more about: dil raju
  English summary
  Dil Raju is producing a film with Sharwanand in the lead. The film has been titled as Satamanam Bhavati. Anupama will be Sharwanand’s leading woman. Satish Vegesna is directing this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X