ఎన్టీఆర్ అయినా సరే, నాకు క్యారెక్టర్ ముఖ్యం: భారీ ఆఫర్‌ని వదులుకున్న అనుపమా
అనుపమా పరమేశ్వరన్ మాత్రం ఎంత పెద్ద హీరో అయినా సరే అంటూ..,ఎన్టీఆర్ సినిమా లో పాత్రని ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
టాలీవుడ్ ,లోకి అడుగు పెడుతూనే వరుసగా అన్నీ జిట్ చిత్రాలలోనే నటించినా గట్టిగా పేరొచ్చే అవకాశం ఉన్న కమర్షియల్ చాన్స్ మాత్రం ఇంకా రాని సమయం లో ఏకంగా ఎన్టీఆర్ సరసన చాన్స్ రావటం మామూలు విషయం కాదు. అయితే అనుపమా పరమేశ్వరన్ మాత్రం ఎంత పెద్ద హీరో అయినా సరే.. ఆ సినిమా రిజెక్ట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.

బిజీకూడా కాదు
అసలు ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీకూడా కాదు. అయినా సరే యంగ్ టైగర్ పక్కన నటించే చాన్స్ మిస్స్ చేసుకుంది. శతమానం భవతితో బ్లాక్ బస్టర్ సాధించాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇప్పుడీ దర్శకుడు దిల్ రాజు బ్యానర్ లోనే శ్రీనివాస కళ్యాణం అంటూ మరో కుటుంబ కథా చిత్రం తీయడానికి రెడీ అయిపోయాడు.

సినిమా సగానికి చనిపోయే పాత్ర
ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఛాన్స్ ను అనుపమకు ఆఫర్ చేశారట. కానీ ఈ పాత్రను దృష్టిలో ఉంచుకుని.. ఆ కేరక్టర్ తాను చేయలేనని తేల్చేసిందట ఈ భామ. ఇందుకు కారణం.. ఈ కేరక్టర్ సినిమా సగానికి చనిపోయే పాత్ర కావడమే.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నా
ఇప్పటికే ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో ఇలాంటి పాత్రనే చేసిన ఈమె.. మరుసటి చిత్రంలో కూడా చనిపోయే పాత్రను చేయలేనని తేల్చేసిందట. సినిమాకు కీలకం అయినా సరే.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నా.. ఈ పాత్రకు ససేమిరా అనేసిందట అనుపమ.

తనకు కేరక్టర్ కూడా ముఖ్యమే
ఆ పాత్ర చనిపోతుందనే కారణంతో.. కేరక్టర్ మొనాటనీ వస్తుందనే ఉద్దేశ్యంతో.. యంగ్ టైగర్ మూవీనే కాదని చెప్పడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హీరో.. బ్యానర్ మాత్రమే కాదు.. తనకు కేరక్టర్ కూడా ముఖ్యమే అని అనుపమా పరమేశ్వరన్ ఎంత స్పష్టంగా చెబుతోందో కదూ.


Click it and Unblock the Notifications











