ఆయన పిలిస్తే వెళ్ళిపోతా: ఒక్క సీన్ అయినా చాలు: అనుపమా పరమేశ్వరన్
ఈమధ్యనే ఒక టాక్ లో మాట్లాడిన తనకు అనుపమా పరమేశ్వరన్ "చిరు సినిమాలో ఒక నిమిషం నిడివి ఉన్న చిన్న పాత్రను చేయడానికి అయినా రెడీ. ఆయన పిలిస్తే వెళిపోతా'' అంటూ చెప్పింది.
Recommended Video

అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో మలయాళీ భామల దండయాత్రలో తెలుగు ప్రేక్షకులని జయించిన అందాల భామల్లో అనుపమా ఒకరు. కళ్ళతోనే చంపేస్తుందా అన్నంత అందమైన లుక్స్ తో అడుగుపెడ్తూనే సైలెంట్ గా వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుందీ మళయాలీ అందం.తెలుగులో 'అనుపమ పరమేశ్వరన్' హవా సాగేలా కనిపిస్తోంది. 'అ ఆ' సినిమాలో చేసింది చిన్న పాత్రే అయిన ఈ కేరళ బ్యూటీ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ వెంటనే 'నాగచైతన్య' తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది. ఇక 'శర్వానంద్' తో నటించిన 'శతమానం భవతి' ఇలా ప్రతీ సినిమాకీ తానొక గోల్డెన్ లెగ్ అయిపోయింది.

చిన్న సీన్ అయినా
ఈమధ్యనే ఒక టాక్ లో మాట్లాడిన ఈ అమ్మడు తనకు ఎవరితో చేయాలని కోరిక ఉందో చెబుతూ.. ముందు రాజమౌళి గారి సినిమాలో చిన్న సీన్ అయినా చేయాలని ఉన్నట్లు చెప్పింది. తరువాత మాత్రం షాకిచ్చింది. ''నేను మొన్న ఖైదీ నెం 150 చూశాను. అసలు చిరంజీవి సార్ 150 సినిమాలు చేశారంటే షాకింగ్ గా ఉంది.

ఆయన పిలిస్తే వెళిపోతా
పైగా ఆ వయస్సులో ఆయన డ్యాన్స్ అండ్ ఎనర్జీ చూస్తే పిచ్చెక్కిపోయింది. అందుకే ఆయన సినిమాలో ఒక నిమిషం నిడివి ఉన్న చిన్న పాత్రను చేయడానికి అయినా రెడీ. ఆయన పిలిస్తే వెళిపోతా'' అంటూ సెలవిచ్చింది అనుపమ. మరి హీరోయిన్ గా చేస్తుందో లేదో తెలియదు కాని.. చిరంజీవి సినిమాలో పాత్ర కావాలంటూ ఓపెన్ గా చెప్పేసింది.

టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత
నిజానికి ఇప్పటికే సీనియర్ హీరోలకి టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత ఉందన్నది కాదనలేని నిజం, ఖైదీ నెం 150 సమయం లో మెగాస్టార్ పక్కన హీరోయిన్ కోసం ఎన్నికష్టాలు పడ్డారో తెలిసిందే, అలాగే గౌతమీ పుత్రశాతకర్ణి సమయం లో బాలకృష్ణకి కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది.

సైరా నరసింహా రెడ్డి
ఇలాంటి సమయం లో అనుపమా లాంటి అమ్మాయిల అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విశయం రామ్ చరణ్ చెవిన పడిందో లేదో ఎటూ ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి కోసం కూడా చిరు పక్కన ఒక హీరోయిన్ కావాలి కదా... చూస్తుంటే 'సైరా' సినిమా కోసం ఏదన్నా రిక్వయిర్మెంట్ ఉంటే వెంటనే రామ్ చరణ్ ఈమెకు కబురంపితే బెటరేమో అనిపిస్తోంది కదూ.

ఉన్నది ఒకటే జిందగి
అయినా సరే.. అసలు అనుపమ చిరు కోరికను విని ఆమె అభిమానులు కూడా స్టన్ అయిపోతున్నారు. ఈమె నటించిన ఉన్నది ఒకటే జిందగి ఈ శుక్రవారం రిలీజవుతోంది. ఈ సినిమా కూడా హిట్ గనక అయ్యిందంటే ఇక అనుపమా ఖచ్చితంగా తన కెరీర్లో ఒక కీలకమైన మలుపు తీసుకున్నట్టే త్వరలోనే ఆమె కోరిక కూడా తీరే చాన్స్ ఉండవచ్చు రాజమౌళి కూడా కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు కాబట్టి అవకాశం ఇవ్వొచ్చేమో...


Click it and Unblock the Notifications











