ఫ్లాపైతే ఫీల్డ్ వదిలేయాలా? స్టార్ డైరక్టర్ మండిపాటు
మర్డర్, గ్యాంగస్టర్, లైఫ్ ఇన్ మెట్రో వంటి ఎక్సలెంట్ ఫిలిమ్స్ రూపొందించిన అనురాగ బసు ఆ మద్య హృతిక్ రోషన్‌తో 'కైట్స్' అనే భారీ ఫ్లాఫ్ ని ఇచ్చారు. దాంతో అంతా అనురాగ్ పని అయిపోయింది, కలకత్తా పారిపోయాడు అని వార్తలు అల్లారు. అయితే ఆయన ప్రస్తుతం 'సైలెన్స్' చిత్రం ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తారు. జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెడతున్నారు. ఈ విషయం చెపుతూ... ఒక సినిమా ప్లాప్ కాగానే ఫీల్డ్ వదిలేసి పారిపోవాలా, ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో..?అయితే నేను ఇటీవల ఓ బంగ్లా ఛానెల్ లైవ్ ఛాట్ షోలో పాల్గొన్నాను. దీంతో ఇలాంటి రూమర్స్ పట్టించారన్నమాట. అయినా నేను హిందీ సినిమాల్ని రూపొందించడం లేదని ఎవరన్నారు..2011లో మూడు సినిమాలు తెరకెక్కించబోతున్నాను. అందులో మొదటిది 'సైలెన్స్' అన్నారు. దీని తరవాత మరో రెండు చిత్రాలు రూపొందిస్తాను. వాటి వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











