»   » షాక్: కాలేజీ అమ్మాయితో స్టార్ డైరెక్టర్ సహజీవనం!

షాక్: కాలేజీ అమ్మాయితో స్టార్ డైరెక్టర్ సహజీవనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే రెండు వివాహాలు... ఆ ఇద్దరితోనూ విడాకులు కూడా చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా మరొకరితో డేటింగ్ మొదలు పెట్టాడు. 43 ఏళ్ల వయసున్న అనురాగ్ కశ్యప్ తన వయసుకు తగిన వారితో డేటింగ్ చేస్తే కామనే... కానీ ఇతగాడు 22 ఏళ్ల వయసున్న మాస్ మీడియా విద్యార్థినితో డేటింగ్ మొదలు పెట్టాడు.

గతేడాది ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుండి మాస్ మీడియాలో గ్యాడ్యుయేట్ అయిన స్టూడెంట్ సుభ్రా శెట్టి.... ప్రస్తుతం అనురాగ్ కశ్యప్‌కు చెందిన ‘ఫాంటమ్ ఫిల్మ్స్' సంస్థలో పని చేస్తోందని సమాచారం. ఎలా పడేసాడో కానీ మొత్తానికి ఆమెతో వ్యవహారం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్ననట్లు సమాచారం.

Anurag Kashyap dating 22-year-old Shubhra Shetty?

ఈ వ్యవహారం అంతా అనురాగ్ కశ్యప్ రహస్యంగా కొనసాగిస్తున్నాడంటే పొరపాటే. ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటున్నారు. తాను ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు డైరెక్టుగా మీడియాతో చెప్పలేదు కానీ.... ఇటీవల ఓ సందర్భంలో తాను సింగిల్ స్టేటస్ నుండి బయటపడ్డానని వెల్లడించారు.

అంతే కాకుండా ఇటీవల ఆయన ఏ విందు వినోదాలకు వెళ్లినా ఆమెను వెంటేసుకుని వెలుతున్నాడట. సుభ్రా శెట్టికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నాడు. ఇలా చేయడం ద్వారా ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడని అంటున్నారు బాలీవుడ్ జనాలు.

సినిమా రంగానికే చెందిన ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్ ను 2003లో పెళ్లాడిన అనురాగ్ కశ్యప్ 2009లో ఆమెతో విడిపోయారు. తర్వాత తాను తెరకెక్కించిన ‘దేవ్-డి' చిత్రంలో నటించిన కల్కి కొచ్లిన్ ను 2011లో పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల కాపురం తర్వాత ఆమెతో 2013లో విడిపోయాడు. మొత్తానికి మళ్లీ సుభ్ర శెట్టి రూపంలో అనురాగ్ కశ్యప్ కు తోడు దొరికింది.

English summary
43-year old Anurag Kashyap's tryst with women seems to be unstoppable. Two broken marriages (Aarti Bajaj, Kalki Koechlin) and one girlfriend later, it seems that Anurag has found love again. 9xe has it that Anurag is actively dating Shubhra Shetty, a Mass Media student from Mumbai's St. Xavier's College who graduated from the institute last year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu