twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనురాగ్ కస్యప్ చేతికి బాలా 'పరదేశి'

    By Srikanya
    |

    ముంబై: బాలా దర్శకత్వంలో నటుడు మురళి కుమారుడు అధర్వ నటిస్తున్న చిత్రం 'పరదేశి'. ఈ సినిమాపై పెరిగిన అంచనాలు బాలీవుడ్‌ వరకు పాకాయి. ఇటీవల చెన్నై వచ్చిన నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ మర్యాదనిమిత్తం దర్శకుడు బాలాను కలిశాడు. పనిలోపనిగా 'పరదేశి' కూడా చూశాడట. అనంతరం బాలాను అభినందనలతో ముంచెత్తాడట. పరిశ్రమకు వచ్చిన తర్వాత ఇలాంటి కథను ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారట. 70 రోజుల్లో పూర్తి చేయటం ఎలా సాధ్యమైందన్న ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరిచారట.

    అంతేగాక హిందీలోనూ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చి అనువాద హక్కులను అక్కడికక్కడే కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆంగ్ల సబ్‌-టైటిల్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలా తెరకెక్కించిన చిత్రాలు దాదాపుగా జాతీయ అవార్డులు అందుకున్నవే. ఈ 'పరదేశి' ఏ ఏ దేశాలను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి!

    శివపుత్రుడు, నేనే దేముడ్ని, వాడు వీడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన తమిళ దర్శకుడు బాలా. ఆయన తాజాగా పరదేశి చిత్రంతో ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్స్ ని విడుదల చేసారు. అథర్వ, వేదిక ప్రధాన భూమికలు పోషించే ఈ చిత్రానికి స్క్రిప్ట్‌కు చక్కగా 'పరదేశి' టైటిల్ సరిపోతుందని అంటున్నారు. దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్‌ కాదవుల్‌' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్‌ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్‌ కాదవుల్‌' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది.

    ఇక పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1930నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్, మన్నముదురై, మున్నారు, తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు, కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు. ఇక ఈ చిత్రం ఆడియో లండన్ లో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో సన్నివేశాలు చాలా భాగం వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ సాగుతాయి అంటున్నారు.

    అయితే సెన్సార్ వద్ద సమస్య వస్తుందా అన్న దానకి.. తాను అవే సీన్స్ తెరపై చూపితే సెన్సార్ వారు కట్ చేసారని, అయితే పాపులర్ టీవీల్లో వాటిని చూపటం ఎంత వరకూ సమంజసం అంటున్నాడు. ఇక తన సినిమా ప్రొమోలు,పోస్టర్స్ చూసి ఫిక్స్ అయిన వారే వచ్చి చూస్తారని, అదే ఛానెల్ లో అయితే చిన్నా పెద్దా అనే తేడాలేకుండా చూస్తారని వివరిస్తున్నాడు. తను తీస్తే తప్పు అయింది.. ఛానెల్ లో చూపితే తప్పు ఎందుకు కాదు అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాల్సిన పని ఉందని చెప్తున్నాడు.

    English summary
    B-town’s ace director has decided to distribute the Tamil movie in Central and North India. The latest buzz in Kollywood is that Anurag Kashyap has shown interest in taking Bala’s Paradesi to a wider market, mainly Central and North India. The Gangs of Wasseypur director plans to screen the film with English and Hindi sub-titles through his company Phantom Films Pvt Ltd. Bala and Anurag Kashyap surely have much in common, with their penchant to walk off the beaten track and set new trends in cinema. It’s quite likely that mutual respect has led to this new business proposition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X