అమీర్ ఖాన్ నెక్ట్స్ ఆస్కార్ చిత్రం దర్శకుడుతో...
భారతదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్ర దర్శకుడు డానీ బొయిల్ నిర్మాతగా మారి త్వరలో అమీర్ ఖాన్ తో ఓ చిత్రం చేయనున్నాడు. 'బోంబే వెల్వెట్' అనే టైటిల్ తో నిర్మాణమయ్యే ఈ చిత్రం స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. హిందీ దర్శకుడు అనురాగ్ కాశ్యప్‌తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ చిత్రం గురించి అనురాగ్ కాశ్యప్ మాట్లాడుతూ...బోంబే వెల్వెట్ కోసం నా మనసులో ఉన్న హీరో అమీర్ ఒక్కరే! త్వరలోనే ఆయనకు పూర్తి స్క్రిప్టు వినిపించబోతున్నాను. ఆయన కాదంటే అప్పుడు ఆలోచిస్తాను. కానీ షారుఖ్‌ను మాత్రం ఈ సినిమా కోసం అడగను. ఎందుకంటే ఇది ఆయనకు సరిపోని కథ. హీరోయిన్, మిగతా నటీనటులు..సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.అయితే అమీర్ ఖాన్ కి ఇప్పటికే లైన్ వినిపించి ఖరారు చేసుకున్నాకే మిగతా స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.


Click it and Unblock the Notifications











