»   » యువతితో దొరికిన టాప్ బాలీవుడ్ డైరెక్టర్.. మూడో కాపురానికి.. కూతురు కంటే..

యువతితో దొరికిన టాప్ బాలీవుడ్ డైరెక్టర్.. మూడో కాపురానికి.. కూతురు కంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోని వ్యవహారాలు, అఫైర్లతో సెన్సేషనల్‌గా మారుతున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌తో చేసుకొన్న పెళ్లి నాలుగేళ్లకే బెడిసి కొట్టింది. ప్రస్తుతం తన కూతురు కంటే 7 ఏళ్ల వయస్సు పెద్దగా ఉన్న యువతితో శృంగారం జరుపుతూ మంచి జోష్ కనిపిస్తున్నాడు. తాజా అఫైర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలను మీరే చూడండి...

గతేడాదిగా శుభ్రతో డేటింగ్

గతేడాదిగా శుభ్రతో డేటింగ్

గత ఏడాది కాలంగా 23 ఏళ్ల శుభ్రశెట్టితో డేటింగ్ చేస్తున్నాడు. వారి మధ్య అఫైర్‌ను బయటపెట్టడానికి నిరాకరించారు. వారి సంబంధంపై మీడియా ఏదైనా ప్రశ్నలు సంధిస్తే వాటిని దాటేసేందుకు ప్రయత్నించారు. తాజాగా బయటపడిన చిత్రాలు వారి మధ్య గుట్టుచప్పుడుగా సాగుతున్న అఫైర్‌ బయటపెట్టాయి. వారి రిలేషన్‌ను ధ్రువీకరించాయి.

2009లో భార్యతో విడాకులు

2009లో భార్యతో విడాకులు

సినిమా పరిశ్రమకు రాకముందే ఆర్తీ అనే యువతితో అనురాగ్ కశ్యప్‌కు పెళ్లైంది. 2009లో వారు విడిపోయారు. వారికి ఆలియానే కూతురు ఉంది. ప్రస్తుతం ఆలియా వయస్సు 16 ఏళ్లు. ఆమె కంటే 7 ఏళ్లు పెద్దదైన శుభ్రతో అనురాగ్ కశ్యప్ అఫైర్ కొనసాగించడం గమనార్హం.

దేవ్ డీ హీరోయిన్‌తో పెళ్లి.. పెటాకులు

దేవ్ డీ హీరోయిన్‌తో పెళ్లి.. పెటాకులు

మొదటి భార్య ఆర్తీతో విడిపోయిన తర్వాత 2011లో దేవ్ డీ చిత్ర హీరోయిన్ కల్కి కోచ్లిన్‌ను పెళ్లి చేసుకొన్నారు. అయితే ఎక్కువ కాలం సాగుతుందనుకొన్న వారి బంధం నాలుగేళ్లకే ముగిసింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నాడు. గతేడాది నుంచి శుభ్రతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

హ్యుమా ఖురేషితో అఫైర్

హ్యుమా ఖురేషితో అఫైర్

ఇవి ఇలా ఉండగా, బాలీవుడ్ నటి హ్యమా ఖురేషితో అఫైర్ నడిపినట్టు అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమా హీరోయిన్‌గా నటించిన హ్యూమా ఖురేషితో సన్నిహితంగా ఉన్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చనే వార్తలు వినిపించాయి. అయితే వ్యక్తిగత విభేదాల వల్ల వారిద్దరూ విడిపోయినట్టు సమాచారం.

ప్రస్తుతం శుభ్రతో ..

ప్రస్తుతం శుభ్రతో ..

తాజాగా అనురాగ్, శుభ్ర ఇద్దరు కలిసి అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్ వీధుల్లో ముద్దు పెట్టుకొంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను శుభ్ర తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీరి వెంట కూతురు ఆలియా కూడా ఉండటం విశేషం. ఈ ముగ్గురు కలిసి వచ్చేవారం న్యూయార్క్ నుంచి బోస్టన్ వెళ్లనున్నట్టు సమాచారం.

English summary
Bollywood director Anurag Kashyap in news for dating this 23 year old girl Shubhra Shetty. The couple's pictures have now gone viral on the Internet. Shubhra and Anurag are reportedly seeing each other for over a year. While they have never confirmed the same, the following pictures are proof enough.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu