»   » ఆ విషయం 'బాహుబలి' చూస్తే అర్థమవుతుంది: అనుష్క

ఆ విషయం 'బాహుబలి' చూస్తే అర్థమవుతుంది: అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్‌తో నేను చేసిన మూడో చిత్రం 'బాహుబలి'. మా ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉంటుందో, మేం సెట్‌లో ఒకరికొకరు ఎలా సహకరించుకొంటామో, ఆ ఫలితం ఎలా ఉంటుందో 'బాహుబలి' చూస్తే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే...రాజమౌళిగారితో రెండో సినిమా చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా చేయడానికి కారణం ఒకటి రాజమౌళిగారైతే మరొకటి 'బాహుబలి' స్క్రిప్టు అన్నారామె. 'రుద్రమదేవి'లో రాణి రుద్రమగా నటించడంతో పాటు... త్వరలోనే 'బాహుబలి' చిత్రంతో దేవసేనగా ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా అనుష్క మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.


అలాగే...''ఈమధ్య చాలా మంది నన్నొక ప్రశ్న అడుగుతున్నారు. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన... ఈ మూడు పాత్రల్లో మీకు ఏది ఎక్కువగా ఇష్టం అని ప్రశ్నిస్తున్నారు. నేనైతే మొదటిదే అని చెబుతాను. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు. అంత క్లిష్టతరమైన పాత్రని ధైర్యంగా చేసి ప్రేక్షకుల్ని మెప్పించగలిగాను. అందుకే ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది'' అంటూ చెప్పిందామె.


Anushka about Baahubali movie

బాహుబలి విషయానికి వస్తే...


బాహుబలిని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Anushka said she is very much happy with Baahubali movie.
Please Wait while comments are loading...