Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా చేతుల్లో ఏమీ లేకండానే నడుస్తోంది: అనుష్క
టెన్త్‌క్లాస్ అయిపోయాక సైకాలజీ చదువుకుని, అది నచ్చక కంప్యూటర్ అప్లికేషన్ చేసి,అదీ నచ్చక యోగా టీచర్‌గా మారాను.తరువాత సినిమాల్లో అవకాశాలు రావడం, హిట్స్ రావటంతో కొనసాగుతున్నాను అంటోంది అనుష్క. అలాగే ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది అని చెప్పుకొస్తూ సినిమా పరిశ్రమలోకి రావాలని ఏనాడూ అనుకోలేదని చెప్పింది చెప్పింది. కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలు అవకాశాలు ఇస్తాం రమ్మని పిలుస్తున్నాయి. వద్దంటున్నా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఏదీ మన చేతుల్లో ఉండదు. అంతా పైవాడి దయ అంటోంది.ఇక ఏమిటీ ఈ కొత్త వైరాగ్యం అంటే..ఆమె ఆస్తులపై రైడింగ్ జరిగినప్పటి నుండీ ఇలా మాట్లాడుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క తెలుగులో ప్రభాస్ సరసన 'రెబల్", నాగార్జునతో 'డమరుకం" చిత్రాల్లో నటించనుంది. తమిళంలో విక్రమ్ సరసన 'దైవ తిరుమగన్" చిత్రంలో నటిస్తోంది. అలాగే అనుష్క తమిళ వేదం చిత్రంలో నటిస్తోంది. అనుష్క పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలోనూ చేస్తోంది.