twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా చేతుల్లో ఏమీ లేకండానే నడుస్తోంది: అనుష్క

    By Srikanya
    |

    టెన్త్‌క్లాస్ అయిపోయాక సైకాలజీ చదువుకుని, అది నచ్చక కంప్యూటర్ అప్లికేషన్ చేసి,అదీ నచ్చక యోగా టీచర్‌గా మారాను.తరువాత సినిమాల్లో అవకాశాలు రావడం, హిట్స్ రావటంతో కొనసాగుతున్నాను అంటోంది అనుష్క. అలాగే ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది అని చెప్పుకొస్తూ సినిమా పరిశ్రమలోకి రావాలని ఏనాడూ అనుకోలేదని చెప్పింది చెప్పింది. కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలు అవకాశాలు ఇస్తాం రమ్మని పిలుస్తున్నాయి. వద్దంటున్నా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఏదీ మన చేతుల్లో ఉండదు. అంతా పైవాడి దయ అంటోంది.ఇక ఏమిటీ ఈ కొత్త వైరాగ్యం అంటే..ఆమె ఆస్తులపై రైడింగ్ జరిగినప్పటి నుండీ ఇలా మాట్లాడుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క తెలుగులో ప్రభాస్ సరసన 'రెబల్", నాగార్జునతో 'డమరుకం" చిత్రాల్లో నటించనుంది. తమిళంలో విక్రమ్ సరసన 'దైవ తిరుమగన్" చిత్రంలో నటిస్తోంది. అలాగే అనుష్క తమిళ వేదం చిత్రంలో నటిస్తోంది. అనుష్క పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలోనూ చేస్తోంది.

    English summary
    Anushka is pairing up with Pawan Kalyan, for the first time. She has been roped in to play female lead in the film being directed by veteran director Singeetam Srinivas Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X