»   » రియల్ లైఫ్‌లో అనుష్క అంత సిన్సియరా...?

రియల్ లైఫ్‌లో అనుష్క అంత సిన్సియరా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలోని టాప్ హీరోయిన్లలో హీరోయిన్ అనుష్క ఒకరు. ఇటు పెర్ఫార్మెన్స్ పరంగానూ...అటు గ్లామర్ పరంగానూ, అందాల ఆరబోత విషయంలో ఆమెకు ఆమే సాటి. సినిమాల్లో అనుష్కను రకరకాల పాత్రల్లో చూసాం. మరి అనుష్క రియల్ లైఫ్‌లో ఎలా ఉండేదో ఎవరికైనా తెలుసా?. ఆ విషయం తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగక మానదు.

బెంగుళూరు లాంటి మెట్రో సిటీలో చదువుకున్న ఆమె....కాలేజీ రోజుల నుండి చాలా స్పీడుగానే ఉండి ఉంటుందని సినిమాల్లో ఆమె ఆటిట్యూడ్ చూసిన వారు భావించడం సహజం. కానీ రియల్ లైఫ్‌లో ఆమె లైఫ్ స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉండేదట. తన కాలేజీ రోజుల గురించి అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ...నేను సాంప్రదాయ బద్దమైన కుటుంబం నుండి వచ్చాను. ఇంట్లో దించిన తల మళ్లీ కాలేజీలోనే ఎత్తేదాన్ని అని అనుష్క తెలిపారు.

అంతేకాకుండా పార్టీలకు వెళ్లడం, కాలేజీ ఎగ్గొట్టడం లాంటి పనులు అసలు చేసేదాన్ని కాదు. ఇంట్లో కూడా అసలు ఉన్నానో లేనో అన్నట్టు సైలెంటుగా ఓ మూలన కూర్చొని చదువుకునేదాన్ని. కాలేజీ రోజుల్లో కొందరు ప్రేమిస్తున్నామంటూ ప్రపోజ్ చేసారు. కానీ అవేమీ నేను సీరియస్‌గా తీసుకోలేదు అంటోంది అనుష్క.

అనుష్క చెబుతున్న మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదూ. తెరపై మనం చూసే అనుష్కకు....ఆమె రియల్ లైఫ్ గురించి చెబుతున్న విషయాలకు అసలు పొంతనే లేదు కదూ. ఈ విషయాలన్నీ స్వయంగా అనుష్కే చెబుతుంది కాబట్టి నమ్మక తప్పదు మరి!

అనుష్క గురించిన వివరాలు స్లైడ్ షోలో....

అసలు పేరు స్వీటీ శెట్టి

అసలు పేరు స్వీటీ శెట్టి


అనుష్క అసలు పేరు స్వీటి. ఆమె పేరు అనుష్కగా మారడం వెనక ఓ చిన్న స్టోరీ కూడా ఉంది. చిన్నతనంలో ముద్దుగా పెట్టిన స్వీటీ అనే పేరే ఆమె పర్మినెంట్ పేరు అయిపోయింది. స్కూలు, కాలేజీలోనూ అదే ఉండేది. దీంతో అంతా ఆమెను ఏడిపించేవారట.

తన పేరు తానే..

తన పేరు తానే..


అప్పటి నుండి తన పేరు మార్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఈ మంగుళూరు బ్యూటీ ‘సూపర్' సినిమాలో అవకాశం రావడంతో తన స్వీటీ అనే పేరు మార్చుకోవడానికి ఇదే సరైన సమయం అని ఫిక్సయింది. దాదాపు వారం రోజులు ఆలోచించి చించీ చివరకు అనుష్క అనే పేరు ఫిక్సయింది. అలా తన పేరు తనే పెట్టుకుంది అనుష్క.

యోగా టీచర్

యోగా టీచర్


అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు.

సినిమాల్లోకి...

సినిమాల్లోకి...


నాగార్జున హీరోగా రూపొందిన ‘సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

English summary
Anushka said she coming from a traditional family, never used to lift her head and was unaware of pubs, parties and bunking colleges.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu