ఇప్పుడా లెక్కలు మారాయి : అనూష్క
'బాహుబలి', 'రాణి రుద్రమ' సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 'ఆ రెండు సినిమాలకు ఎన్ని కాల్షీట్లు కావలిస్తే అన్ని ఇస్తా' అని చెబుతోంది. '' హీరోయిన్ ప్రాధాన్యం పెరుగుతోంది. 'వీళ్లపై కోట్లు పెట్టొచ్చు' అని నిర్మాతలు నమ్ముతున్నారు. ఇది మంచి పరిణామం'' అంటోంది అనుష్క. ప్రస్తుతం కెరీర్ సంతృప్తికరంగా సాగుతోంది. 'మిర్చి' ఘన విజయం సాధించటం, గుణశేఖర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ ఇటీవలే ప్రారంభమవటం, సూర్యకు జంటగా మరోసారి అవకాశం రావటం నాకు కలిసొస్తున్న విషయాలని చెప్పింది.
భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెప్తూ...కహానీ రీమేక్ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా. ప్రస్త్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి. ఇక కాంబినేషన్ సినిమాలంటే తొలుత స్కిప్ట్ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.


Click it and Unblock the Notifications












