తెలుసా...నాలో స్ల్పిట్ పర్శనాల్టీ ఉంది..అనూష్క
నేను అప్పుడప్పుడూ అపరిచితురాల్లా బిహేవ్ చేస్తూంటాను అంటోంది అనూష్క. హాయిగా నవ్వడం, ఆ వెంటనే కోపంతో బుసలు కొట్టడం, మరుక్షణం ఏమీ తెలియని అమాయకుడిగా ఫేస్ పెట్టడం... ఈ లక్షణాలున్న పాత్రను మనం 'అపరిచితుడు' చిత్రంలో చూశాం. ఇలా నిమిషానికో రకంగా ప్రవర్తించడాన్ని 'స్ల్పిట్ పర్సనాల్టీ' అంటారు. 'నిజజీవితంలో అతి తక్కువమందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వాళ్ల జాబితాలో నేనూ చేరతాను' అంటున్నారు అనుష్క. ఆమె చాలా ఎమోషనల్ అట. ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే ఫీలైపోతానంటున్నారు. ఆ బాధ క్షణికమేనని, మళ్లీ మామూలు మూడ్‌లోకి వచ్చేస్తానని కూడా ఆమె రీసెంట్ గా ఓ సందర్భంలో చెప్తోంది. ఇక అదలా ఉంచితే 'అరుంధతి' విజయం తర్వాత 'నంబర్‌వన్' స్థానం అనుష్కదేనని వార్తలు వినిపిస్తున్నాయి. మరి, మీరేమంటారు? అనే ప్రశ్నను ఆమెను అడిగితే.. "నేను మాత్రం ఆ మాటతో ఏకీభవించను. జస్ట్ ఒకే ఒక్క సినిమా సక్సెస్ అయినంత మాత్రాన నంబర్‌వన్ ఎలా అయిపోతాం? అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయితే 'నంబర్‌టెన్' అనడం కూడా సబబు కాదు. అయినా సినిమా జయాపజయాలను ఆధారం చేసుకుని నంబర్లను నిర్ణయించకూడదు' అన్నారామె. ఆలాగే ఈ జనరేషన్ హీరోయిన్స్ లో ో మీకెవరంటే ఇష్టం? అని అడిగితే - "అందరూ ఇష్టమే. నయనతార డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. తనలో నాకా విషయం నచ్చుతుంది. త్రిష కూడా తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా మూడు భాషల్లో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇంకా ఇలియానా.. ఇలా తారలందరూ తెలివిగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు' అని చెప్పారు అనుష్క. మొత్తానికి ఏ హీరోయిన్ నీ ఎత్తేయకుండా అందరినీ పొగడి జస్టిఫై చేసింది కదా. అందుకే ఆమె అపరిచితురాలు కాదు కానీ అమితమైన తెలివైనది అంటూంటూరు ఆమె శ్రేయాభిలాషులు.ప్రస్తుతం అనూష్క మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో వేదం చిత్రంలో చేస్తోంది. వీటితో పాటు తమిళంలో ఓ రెండు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన చేస్తోంది.


Click it and Unblock the Notifications











