మహేష్ బాబుతో పోటీగా చేయడానికి చాలా కష్టపడ్డాను...!?
నేను తొలి సినిమా అప్పుడు ఎలా ఉన్నానో...ఇప్పుడూ అలాగే ఉన్నాను. పేకమేడ లాంటి ఈ స్టార్ డమ్ చూసి భుజాలు ఎగరేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం" అంటున్నారు అందాల అనుష్క. టాలీవుడ్ లో సూపర్ హీరోయిన్ మీరేనని చాలామంది భావన. మరి మీ భావనేంటి..? అని ఈ ముద్దమందారాన్ని అడిగినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు.
ఇంకా అనుష్క మాట్లాడుతూ- 'ఈ నెంబర్ల గోలంటే నాకు అస్సలు పడదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు పోషించి, నా కంటే గొప్ప స్టార్ డమ్ ని ఎంజాయ్ చేసిన తారలు పరిశ్రమలో చాలామంది ఉన్నారు. వారితో పోల్చుకుంటే నా లాంటి వాళ్లు ఎంత చెప్పండి..? కాకపోతే వారిలాగే.. రిటైర్ అయ్యాక కూడా నా గురించి, నేను చేసిన పాత్రల గురించి చెప్పుకుంటే చాలు. అదే నేను కోరుకునేది.
ఆ పేరుకోసమే.. అరుంధతి, వేదం లాంటి వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇంకా చేస్తాను కూడా" అని చెప్పారు అనుష్క. ఇంకా ఆమె మాట్లాడుతూ-'ఖలేజా"లో నేను పోషించిన సుభాషిణి పాత్ర నాకు చాలాబాగా నచ్చింది. తొలిసారిగా కామెడీ చేసే అవకాశం వచ్చింది నాకు ఆ పాత్ర ద్వారా. త్రివిక్రమ్ ఆ పాత్రను మలిచిన తీరు నాకు చాలాబాగా నచ్చింది. మహేష్ కు పోటీగా హ్యూమర్ ను పండించడానికి చాలా కష్టపడ్డాను. చూసిన వారందరూ నా పాత్రను అభినందిస్తుంటే.. చెప్పలేనంత సంతోషం అనిపించింది" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అనుష్క.


Click it and Unblock the Notifications











