రాజమౌళి సీన్స్ బాగా రావడం కోసం... :అనుష్క
ప్రభాస్, అనుష్క కాంబినేషన్ లో ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'బాహుబలి' . దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం షెడ్యూల్ పూర్తయింది. భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రాల జాబితాలో చేరబోతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఐదు భారీ సెట్స్‌లో ఇప్పటివరకూ షూటింగ్ జరిగింది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా కూడా ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇపుడు అనుష్కపై స్పెషల్ వీడియో విడుదల చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ.
80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: కీరవాణి, ఫొటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్, మాటలు: అజయ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్టైలింగ్: రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.


Click it and Unblock the Notifications












