రహస్యంగా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: అనుష్క
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుష్క ఇటీవల బాహుబలి సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన రాగా తనదైన రీతిలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ...‘గడిచిన ఆరేళ్లలోనా పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు విన్నాను. పెళ్లికి సంబంధించిన విషయాల్లో నేను తప్పించుకోవడానికి ఏమీ ప్రయత్నించడం లేదు. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. అందరినీ ఆహ్వానించి పెళ్లి చేసుకుంటా. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అందరికీ తెలిసే జరుగుతుంది' అని స్పష్టం చారు.

బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ...‘ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్. ‘బాహుబలి' లాంటి సినిమా భవిష్యత్తులో మరొకటి చేస్తానో? లేదో? కూడా తెలియదు. అయితే ‘బాహుబలి' ఫస్ట్ పార్టులో నేను కనిపించేది చాలా తక్కువ సమయమే. అయితే బాహుబలి సెకండ్ పార్టులో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తాను. రిస్కీ యాక్షన్ సీన్లు చాలా వరకు నేనే స్వయంగా ఎలాంటి డూప్ లేకుండా చేసాను' అని తెలిపారు.
చాలా మంది నేన్ను ఇంత అందంగా ఎలా ఉండగలుతున్నారు అని అడుగుతున్నారు. ఈ విషయంలో ముందుగా నేను చెప్పేది ఒక్కటి. అందం అనేది తల్లిదండ్రుల జీన్స్ నుండే వస్తుంది. తర్వాత మంచి ఫుడ్ హాబిట్స్, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా దాన్ని కాపాడుకోవచ్చు. అంతకుమించి ఏమీలేదు... అన్నారు.


Click it and Unblock the Notifications











