»   »  అనుష్క ని పర్మెనెంట్ వేశ్యగా కంటిన్యూ చేస్తున్నాడు

అనుష్క ని పర్మెనెంట్ వేశ్యగా కంటిన్యూ చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో మంచి విజయం సాధించిన 'వేదం" చిత్రాన్ని తమిళంలో 'వానమ్" పేరుతో రీమేక్‌ అయి అక్కడా మంచి విజయాన్నే సాధించింది. అలాగే తెలుగు 'వేదం"లో వేశ్య పాత్రతో అలరించిన అనుష్క తమిళ వేదంలోనూ అదే పాత్ర పోషించి మెప్పు పొందింది. దాంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో వేశ్యగా అలరించిన అనుష్క హిందీలోనూ వేశ్య పాత్ర పోషించనుంది.అనూష్క మరో సారి అదే పాత్ర చేయటానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా క్రిష్ పట్టుదలతో ఆ పాత్రకు మరో సారి ఒప్పించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో అనూష్క హిందీ సినీ ప్రవేశం జరగనుంది. ఇంతకుముందు ఆమెకు 'సింగం" (తెలుగులో 'యముడు") హిందీ రీమేక్‌లో అజయ్‌దేవగన్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే అనుష్క అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఆమె స్థానంలో కాజల్‌ను తీసుకున్నారు. మరోసారి అందివచ్చిన అవకాశం వదులుకోవద్దని ఆమె శ్రేయాభిలాషులు కూడా చెప్పుతూండటంతో అనూష్క మరోసారి వేశ్య అవతారం ఎత్తటానికి రెడి అయిపోయింది. అక్కడా హిట్టు అయితే ఆ చిత్రం ఏ బాషలోకి వెళ్ళినా అనూష్కనే ఆఫర్ వరించటం ఖాయం.

English summary
Telugu blockbuster ‘Vedam’, which was remade in Tamil as ‘Vaanam’ and hit the screens last week, is now all set to Remake in Hindi.And the Hindi version too will be directed by Krish, who had wielded the megaphone in Telugu and Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu