మళ్ళీ బికినీ వేస్తానంటున్న అనుష్క
'బిల్లా'లో బికినీ వేసి అదరకొట్టిన అనుష్క మళ్ళీ అలాంటి పాత్ర దొరకితే వదులుకోను అంటోంది. తాజాగా ఆమె నటిస్తున్న వేదం, పంచాక్షరి చిత్రాలు గురించి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. "అవసరమైతే బికినీలో కనిపించడం తప్పుకాదు కానీ...అనవసరంగా ఎందుకనది నా పాలసీ?..మళ్లీ 'బిల్లా' లాంటి స్టైయిలిష్ మూవీలో స్టైలిష్ క్యారెక్టర్ దొరికితే, ఆ పాత్రకు బికినీ అవసరమైతే తప్పక వేస్తా' అంది అనుష్క. ఇక తప్పనిసరిగా 'పంచాక్షరి' విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంతో ఉన్నారు. పంచాక్షరి'లో పొంతన లేని రెండు పాత్రలు చేశా. అలాగే 'వేదం'లో నా కెరీర్‌లోనే భిన్నమైన పాత్ర చేశాను. ఇదంతా నా అదృష్టం' అంటూ ఆనందపడిపోతోంది. ఎంతో కష్టపడి తెలుగు కూడా నేర్చుకున్నాను. త్వరలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటా. తమిళ పరిశ్రమలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి కానీ నా తొలి ప్రాధాన్యం మాత్రం తెలుగు సినిమాకే అని తేల్చిచెప్పింది. అనుష్క ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సరసన చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సరసన లవ్ ఆజ్ కల్ రీమేక్ లోనూ ఎంపికైంది. వెంకటేష్ సరసన చంద్రముఖి సీక్వెల్ లోనూ ఆమె హీరోయిన్ గా కమిటయింది.


Click it and Unblock the Notifications











