ప్రెస్ మీట్ లో మీడియాపై అరిచిన అనూష్క
ఒళ్లు మండే ప్రశ్నలేస్తే ఊరుకునేది లేదు అంటూ మీడియాకు అనూష్క వార్నింగ్ ఇచ్చింది.నాన్న సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆమెను మీ బికినీ ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి అంటూ అడిగారు.అయితే ఆ ఫోటోలు అనూష్క శర్మవి.'అనుష్క శెట్టి" అనే పేరుతో బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఫేక్ బికినీ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో చాలా అశ్లీలంగా దర్శనమిస్తున్నాయి. దాంతో తమిళనాడులో ఎక్కడకు వెళ్లినా అందరూ ఆ ఫొటోల గురించే అనుష్కతో ప్రస్తావిస్తున్నారు. ఈ కారణంగా ఆమె బాగా విసిగిపోయారు.
దాంతో ఆమె మండిపడిపోయింది.అంతేగాక ఆ అనుష్కను నేను కాను. ఆ ఫొటోల గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మరోసారి ఈ టాపిక్ నా దగ్గర తేవొద్దు అంది.ఇక అంత కోపమైతే ఎలా అంటే ...మరి అనుష్క శర్మకు, అనుష్క శెట్టికీ తేడా తెలియదా? నాకు సంబంధంలేని ఫొటోల గురించి నన్ను అడిగితే ఒళ్లు మండదా అని అడిగింది. ఆమె కోపం చూసిన చెన్నై జర్నిలిస్టులు షాక్ అయ్యిపోయారు.ఎప్పుడూ నవ్వుతూ సమాధానమిచ్చే ఆమె అలా అరుస్తూ మండిపడటం వారు ఊహించలేదు.అయితే ఆమె వైపు రీజన్ కరెక్టుగా ఉండటంతో వారు ఏమీ మాట్లాడలేకపోయారు.


Click it and Unblock the Notifications











