'అనుష్క...నిన్నొదలా..' అంటూ ఆమె వెనకే నాగార్జున
అనుష్క తన కలల్లోకి వస్తోందంటూ బహిరంగంగా నాగార్జున 'పంచాక్షరి' ఆడియో పంక్షన్ లో కామెంట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆమెను తన సినిమాలోకి తీసుకుని ఆ అభిమానాన్ని మరో నిరూపించారు నాగార్జున. తన చిత్రం సూపర్ తో పరిచయమైన అనుష్క అంటే నాగార్జునకు మొదటి నుంచీ ప్రత్యేకాభిమానం ఉంది. మొన్న ఆయన చిత్రం కేడీలో ఐటం సాంగ్ చేసిన ఈ భామ...ఇప్పుడు మరో సారి నాగార్జున సరసన నటించటానికి కమిటయింది. బిందాస్ తో దర్శకుడుగా పరిచయమైన రచయిత వీరూపోట్ల రూపొందించే చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని అనుష్క కన్ఫర్ఫ్ చేసింది. దానిని కామాక్షి కళా మూవీస్ పతాకంపైనే నిర్మించనున్నామని శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
లేటెస్ట్ గా మీరు చేస్తున్న చిత్రాలేమిటీ అంటే...మహేష్ బాబుతో ఒక సినిమా నడుస్తుంది. అలాగే వెంకటేష్ తో చంద్రముఖి సీక్వెల్ చేయాలి. నాగార్జున హీరోగా వీరు పోట్ల దర్శకత్వం వహించే చిత్రం అంగీకరించాను అంది. ఇక నాగార్జునతో అనుష్క ఇంతకుముందు డాన్ చిత్రంలో హీరోయిన్ చేసింది. అలాగే భూమిక నిర్మిస్తున్న తకిట..తకిట చిత్రంలో నాగార్జునతో పాటు గెస్ట్ గా చేస్తోంది. అలాగే నాగార్జున సమర్పిస్తున్న పంచాక్షరిలోనూ అనుష్కే హీరోయిన్. ఇలా నాగార్జునతో అనుష్క తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇక అనుష్క...అమలాపురం సరోజగా వేశ్య పాత్రలో జీవించిందంటూ రీసెంట్ గా రిలీజైన వేదం చిత్రం గురించి చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











