అనుష్క- ఆర్య తెలుగు మూవీ టైటిల్ చేంజ్
హైదరాబాద్ : హాట్ లేడీ అనుష్క, తమిళ హీరో ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళంలో 'ఇరండమ్ ఉలగమ్' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కి గతంలో 'బృందావనంలో నందకుమారుడు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. అయితే తాజాగా ఆ టైటిల్ మార్చారు.
తెలుగులో ఈ చిత్రాన్ని 'వర్ణ' అనే పేరుతో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది.
జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి పివిపి సినిమాస్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో సినిమా ఆడియో విడుదల చేసి, రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











