ఇక అనుష్క...కంటిన్యూగా రవితేజని కబడ్డి ఆడేస్తుంది
అరుంధతిగా అదరకొట్టిన అనుష్క త్వరలో కబడ్డీ చిట్టిగా ఆకట్టుకోనుంది. ఈ పాత్ర పక్కా మాస్ లక్షణాలు కలిగి ఉంటుందని సమాచారం. ఇంతకీ ఈ పాత్రని అనుష్క ఏ చిత్రంలో చేయబోతోంది అంటే రవితేజ హీరోగా ఆమె చేయనున్న 'వీర' కోసం. అందులో ఆమె రవితేజను టీజింగ్ చేస్తూ కవ్వించి ప్రేమలో పడే క్యారెక్టర్ అంటున్నారు. ఇక ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క పాటు తాప్సి హీరోయిన్ గా చేస్తోంది.ఇక రమేష్ వర్మ ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో భీష్మ అనే చిత్రం ప్రారంభించి ఆపుచేసారు. అయితే రైడ్ అనే చిత్రం విజయవంతం కావటంతో అతనిపై మంచి నమ్మకాలు ఉన్నాయి. రైడ్ చేయాటానికి రమేష్ వర్మ..ఒక ఊరిలో, మల్లెపూవు అనే రెండు ప్లాఫ్ చిత్రాలుకు కథలు ఇచ్చారు. ఇక రవితేజ ప్రస్తుతం మిరపకాయ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిరపకాయ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











