'కాంచన' గా అవతరించనున్న అనుష్క
అరుంధతిగా అదరకొట్టిన అనుష్క త్వరలో 'కాంచన' గా కనువిందు చేయనుంది. కొరియోగ్రాఫర్ నుంచి డైరక్టర్ కమ్ హీరోగా మారిన లారెన్స్ ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నాడు. ఆయన నటించిన 'ముని' చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ విషయం స్వయంగా లారెన్స్ మీడియాకు వెళ్ళడిస్తూ...త్వరలో 'కాంచన'కు సంబంధించిన పనులను ప్రారంభిస్తాం. తెలుగు, తమిళ భాషల్లో చిత్రిస్తాం. అనుష్క పాత్ర చాలా కీలకమైంది. అందుకే చిత్రానికి కూడా అదే పేరును ఖరారు చేశాం. ఇప్పటికీ 'ముని' సినిమా గురించి చెప్పేవాళ్లున్నారు. అందుకే కొనసాగింపు చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచన వచ్చిందన్నారు. అలాగే అనుష్క ప్రస్తుతం పంచాక్షరి చిత్రంలో చేస్తోంది. సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తోంది. మరో ప్రక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సరసన అనుష్క చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక లారెన్స్ హీరోగా రూపొందుతున్న సూపర్ కౌబాయ్ చిత్రం షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











