అనుష్క క్యారక్టర్ రివిల్...అందుకే ఆ మేకప్(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : అనుష్క వైవధ్యమైన పాత్రలు ఎంపిక చేసుకుని మరీ నటిస్తూండటంతో ఆమె ఓ చిత్రం సైన్ చేసిందంటే ఆ క్యారెక్టర్ ఏమిటనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉండనే ఉంటోంది. తాజాగా అజిత్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'ఎంతవాడుగానీ' లో అనుష్క,త్రిష నటిస్తున్నారు. గౌతమ్‌ వాసుదేవమీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ ఐ ', ‘ లింగ ' చిత్రాల తరహాలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఈనెలలోనే రిలీజ్‌ కానుంది.

ఆ మధ్యన అనుష్క ఎయిర్ పోర్ట్ లో ఈ చిత్రానికి సంభందించిన మేకప్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఫొటోలే కనిపించాయి. ఆ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ పాత్ర ఏమిటనేది ఇప్పుడు రివీలైంది.

ఆ చిత్రంలో ఆమె విదేశాల నుంచి వచ్చిన తెలుగు అమ్మాయిగా కనిపించనుంది. అందుకే డిఫెరెంట్ గా ఆమె కనిపించింది. త్రిష సైతం డాన్సర్ గా కనిపిస్తోంది. చిత్రానికి ఎస్‌.ఐశ్వర్య నిర్మాత. హారీస్‌ జైరాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈనెలలోనే ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేస్తారు.

 దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

''అజిత్‌ పాత్రలో మూడు విభిన్నమైన కోణాలుంటాయి. అనుష్క విదేశాల నుంచి వచ్చిన తెలుగమ్మాయిగా నటిస్తోంది. త్రిష ఓ సంప్రదాయ నృత్య కళాకారిణిగా కనిపిస్తుంది. ఈ ముగ్గురి మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. హారీస్‌ అందించిన ఏడు పాటలూ తప్పకుండా ఆకట్టుకొంటాయి''అన్నారు.

అలాగే...

అలాగే...

‘‘ ఇంతకుముందు తమిళ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన అరుణ్‌ విజయ్‌ ఈ చిత్రంలో అజిత్‌కి ఈక్వెల్‌గా వుండే నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన సరసన పార్వతి నాయర్‌ నటిస్తున్నారు. ఆశిష్‌ విద్యార్థి, సుమన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. హారీస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో ఏడు పాటలు వుంటాయి. అజిత్‌ కాంబినేషన్‌లో నేను చేస్తున్న ఈ సినిమా మరో సెన్సేషనల్‌ కమర్షియల్‌ ఫిలిమ్‌ అవుతుంది.'' అన్నారు.

నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ....

నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ....

‘‘ ఎనిమిది నెలలుగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. చెన్నై, రాజమండ్రి, మలేషియా వంటి డిఫరెంట్‌ ప్లేసెస్‌లో షూటింగ్‌ చేశాము. అలాగే జోధ్‌పూర్‌, జైపూర్‌, పెల్లింగ్‌, గ్యాంగ్‌టక్‌ వంటి ప్రదేశాల్లో అజిత్‌పై చిత్రీకరించిన పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రానికి సంబంఽధించి నిన్న రిలీజ్‌ అయిన తమిళ చిత్రం టీజర్‌కి యూ ట్యూబ్‌లో ఇప్పటికే 10 లక్షల హిట్స్‌ వచ్చాయి.

తెలుగులో కూడా ...

తెలుగులో కూడా ...


తెలుగులో ఈ రోజు ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. ఎన్‌.టి .రామారావు గారి సూపర్‌హిట్‌ సాంగ్‌ అయిన ‘ఎంతవాడు గానీ, వేదాంతులైన గానీ' అనే పాటలోని పల్లవిని తీసుకొని ఎంతవాడు గానీ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.'' అన్నారు.

భారీ అంచనాలు...

భారీ అంచనాలు...

అజిత్ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇది ఆయన 55వ చిత్రం కావడం మరో విశేషం.

వీరిద్దరూ చాలు..

వీరిద్దరూ చాలు..

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. అందాలభామలు అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ముఖ్య పాత్ర...

ముఖ్య పాత్ర...

మరో విషయం ఏమిటంటే చిత్రంలో అదనంగా కేరళ కుట్టి పార్వతి నాయర్ వచ్చి చేరింది. ఈ అమ్మడి చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోందట.

అనుష్కతో లిప్ లాక్...

అనుష్కతో లిప్ లాక్...

శింబుతో నయనతార, బన్నీతో కాజల్, నాగచైతన్యతో సమంత ఇప్పటికే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి అనుష్క కూడా చేరారు. ఇంతకీ అనుష్క అధరాలను చుంబించిన ఆ హీరో ఎవరో తెలుసా? అజిత్. ఈ చిత్రంలో ఈ సీన్ హైలెట్ అంటున్నారు.

చాలా బోల్డ్ గా...

చాలా బోల్డ్ గా...

కథ రీత్యా ఇందులో శృంగారభరితమైన ఓ సన్నివేశం ఉంది. ఆ సీన్‌ని గౌతమ్ చాలా బోల్డ్‌గా తీశారని కోలీవుడ్ సమాచారం.

జాగ్రత్తలు..నిర్ణయాలు

జాగ్రత్తలు..నిర్ణయాలు

తాను అనుకున్నట్లు ఆ సన్నివేశం రావడానికి గౌతమ్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారట. అలాగే ఆ సీన్ క్లిప్స్ బయిటకు వెళ్లకూడదని కూడా స్ట్రిక్ట్ గా చెప్పాడట. దాంతో యూనిట్ మొత్తాన్నీ బయటకు పంపించేసి, తాను, అజిత్, అనుష్క, కెమెరామేన్ మాత్రమే లొకేషన్లో ఉండి, ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట.

రెచ్చిపోయి..

రెచ్చిపోయి..

ఈ సీన్‌లో అజిత్, అనుష్క రెచ్చిపోయి నటించారని యూనిట్ సభ్యులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఈ సన్నివేశంలో భాగంగానే వీరిద్దరితో లిప్‌లాక్ కూడా చేయించారట గౌతమ్. ఈ సన్నివేశం సినిమాకు హైలైట్ కానుందని కోలీవుడ్ టాక్.

ఎవరెవరు...

ఎవరెవరు...

తెలుగులో ఈ పోస్టర్స్ చూడగానే అంతా దుమ్ము రేపే చిత్రం అని భావిస్తున్నారు. దానికి తోడు ..సంక్రాంతికి రానుండటంతో మంచి క్రేజే వస్తుందంటున్నారు. చూడాలి మరి దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకుంటుందో.అరుణ్‌ విజయ్‌, వివేక్‌, సుమన్‌, పార్వతి నాయక్‌, ఆశిష్‌ విద్యార్థి, నాజర్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: డాన్‌మకార్థుర్‌, కూర్పు: ఆంటోని, పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X