అనుష్క కోసం సర్వవిధాలా ట్రై చేస్తున్న దాసరి...!?
'పరమవీర చక్ర" సినిమాతో బాలయ్యకు కెరీర్ లో మర్చిపోలేని ప్లాపిచ్చిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, ఈసారి అనుష్క మీద మనసు పారేసుకున్నాడట. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వుందన్న కోణంలో, ఈసారి ఎలాగైనా హిట్ కొడ్తాననే ధీమాతో దాసరి 'రామసక్కని తల్లి" అనే సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం అనుష్కని దాసరి ట్రై చేస్తున్నట్లు సమాచారం. అనుష్క అయితే సినిమాకి పబ్లిసిటీ పరంగా బాగా హెల్పవుతుందనీ, బిజినెస్ పరంగానూ పెద్దగా ఇబ్బందులుండవనేది దాసరి ఉద్దేశ్యంగా కన్పిస్తోంది.
అయితే పరమవీర చక్ర" సినిమాని అంత తేలిగ్గా టాలీవుడ్ లో ఎవరూ మర్చిపోలేరుగనుక, దాసరికి అనుష్క మొహం చాటేసే అవకాశాలే ఎక్కువ. మరి దాసరి తన పాపులారిటీనంతా ఉపయోగించి, అనుష్కని తన సినిమాలో నటింపజేస్తాడా..?అనేది ప్రస్తుతానికి సస్పెన్సే..


Click it and Unblock the Notifications