»   » ప్రేమ లేనపుడు ఎందుకంటూ అనుష్క.. (ఫోటోలు)

ప్రేమ లేనపుడు ఎందుకంటూ అనుష్క.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమిస్తేనే తీసుకెళ్లండి, ప్రేమించే మనసు లేకుంటే తీసుకెళ్లొద్దు. ఏదో స్టేటస్ సింబల్‌గానో, డాబు దర్బంగా మాత్రం అసలే వద్దు అంటోంది హీరోయిన్ అనుష్క. ఆమె ఈ మాటలు అంటోంది ఏ విషయంలో తెలుసా? పెంపుడు కుక్కల విషయంలో! 'పెంపుడు జంతువులను ప్రేమించలేనప్పుడు వాటిని తీసుకుని వెళ్లకూడదు' అని నటి అనుష్క సూచిస్తోంది.

పెడిగ్రీ సంస్థతో కలిసి బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మొట్టమొదటి పెట్ కార్నివాల్ గురించిన విశేషాలను తెలియజేయటానికి ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవితంలో పెంపుడు జంతువుల వల్ల మానసిక ప్రశాంతత కలిలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కో ఫౌండర్ వాసంతి వడితో పాటుగా మార్స్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ అజయ్‌తో కలిసి అనుష్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుష్క మాట్లాడిన మరిన్ని విషయాలు స్లైడ్ షోలో....

సమయం చిక్కడం లేదు

సమయం చిక్కడం లేదు


నగర బిజీ జీవితంలో కాస్త మానసిక ప్రశాంతత కలిగించేటటువంటివి పెంపుడు జంతువులే అని చెప్పిన అనుష్క బిజీ జీవితంలో వాటితో గడపటానికి కూడా చాలామందికి సమయం చిక్కటం లేదన్నారు.

పెట్ కార్నివాల్

పెట్ కార్నివాల్


జనవరి 26 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ శిల్పారామం సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెట్ కార్నివాల్ నిర్వహించబోతున్నారు.

అవికూడా మన ఫ్యామిలీ మెంబర్సే

అవికూడా మన ఫ్యామిలీ మెంబర్సే


దీన్ని పెట్ కార్నివాల్ అనటం కన్నా ఫ్యామిలీ కార్నివాల్ అనాలి. ఎందుకంటే... పెట్స్‌ను కూడా ఫ్యామిలీలో సభ్యులుగా చూసుకోవాలి అని అనుష్క పేర్కొన్నారు.

కార్నివాల్‌లో ఏం చేస్తారు?

కార్నివాల్‌లో ఏం చేస్తారు?


పెట్స్ కార్నివాల్‌లో పెట్స్‌కు సంబంధించిన సందేహాలన్నీ తీరుస్తారు. మ్యాజిక్ షోలు, డాగ్ ర్యాంప్ వాక్స్.. ఇలా ఎన్నో విశేషాలున్నాయని తెలిపారు.

పెట్స్ గురించి పూర్తిగా..

పెట్స్ గురించి పూర్తిగా..


ఒక రోజు పాటు జరిగే ఈ కార్నివాల్‌లో నగరవాసులకు పూర్తి వినోదం అందించనున్నారు పెట్స్ గురించిన పూర్తి విశేషాలను ఈ కార్నివాల్‌లో తెలియజేస్తారు.

English summary

 Pedigree, world’s leading pet food manufacturer and Blue Cross of Hyderabad, a voluntary organization for welfare of animals are all set to organize a fun-filled Pet Carnival for the people of the city of Nawabs, to be held on January 26, 2014 at N-Convention centre, Hyderabad. Telugu Actress Anushka Shetty graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu