»   » నాలాగే వీళ్లలోనూ ఆ టెన్షన్ ఉందన్న అనుష్క (ఫోటో ఫీచర్)

నాలాగే వీళ్లలోనూ ఆ టెన్షన్ ఉందన్న అనుష్క (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం' ప్రేమ ఇష్క్ కాదల్'. షిర్డి సాయి కంబైన్స్, లక్కీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు సమర్పణ. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. హర్షవర్ధన్, రాణే, విష్ణు, హరీష్, వితిక, రీతూ వర్మ, శ్రీముఖి హీరోహీరోయిన్లు.

ఇటీవల ఈ చిత్రం ఆడియో విడుదలవ్వగా, తాజాగా ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ....'నేను మొదటి చిత్రం 'సూపర్'లో నటించిన సమయంలో ఎంత టెన్షన్ ఫీలయ్యానో, అదే టెన్షన్ ఈ టీమ్‌లో చూస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

విభిన్నమైన చిత్రాలు చేయాలని గోపీ అన్నయ్య తపన పడుతుంటారు. ఈ సినిమాకు శ్రవణ్ అందించిన సంగీతం చాలా బాగుంది. బాలల దినోత్సవం రోజున ఈ సినిమా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు అనుష్క.

అనుష్క

అనుష్క


బాలల దినోత్సవం రోజు ఆడియో సక్సెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఈ కార్యక్రమానికి ఇద్దరు చిన్నారి యాంకర్లు యాంకరింగ్ చేసారు.

బాలల దినోత్సవ వేడుకలు

బాలల దినోత్సవ వేడుకలు


ఆడియో సక్సెస్ మీట్లో బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుష్కకు కేక్ తినిపిస్తున్న చిన్నారి.

యూనిట్ సభ్యులతో...

యూనిట్ సభ్యులతో...


ఈ చిత్ర యూనిట్ సభ్యులతో అనుష్క. ఈ సందర్భంగా అనుష్క చేతుల మీదుగా వారికి మొమొంటోలు అందించారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో హర్షవర్ధన్, రాణే, విష్ణు, హరీష్, వితిక, రీతూ వర్మ, శ్రీముఖి హీరోహీరోయిన్లు. సంగీతం : శ్రవణ్, నిర్మాత: బెక్కెం వేణుగోపాల్, సమర్పణ: డి సురేష్ బాబు, దర్శకత్వం: పవన్ సాదినేని

హర్షవర్ధన్, గుత్తా జ్వాల

హర్షవర్ధన్, గుత్తా జ్వాల


హర్ష వర్దన్ రాణె, గుత్తా జ్వాల మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఈ మధ్య మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆడియో కార్యక్రమానికి కూడా ఆమె హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

English summary
Harsha Vardhan Rane, Vishnu, Harish, Vithika Sheru, Rithu Varma and Srimukhi are playing the lead roles in a film titled 'Prema...Ishq...Kadhal'. Pavan Sadhineni is being introduced as the director with this film. The movie audio success meet held in Hyderabad yesterday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu