తెలివిగా నాగచైతన్యని ఎవాయిడ్ చేసి అనుష్క...
నాగచైతన్య, అనుష్క వివాహం చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య మీడియాలో ఒక్కసారి గుప్పుమన్న సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకున్న అనుష్క మొన్న జరిగిన ఐడియా ఫిల్మ్ పేర్ అవార్డు ల పంక్షన్ లో కావాలనే నాగచైతన్యను ఎవాయిడ్ చేయటం అందరి కళ్ళల్లో పడింది. ముందుగా తన తండ్రి నాగార్జునతో వచ్చిన నాగచైతన్య తన కజిన్ రానా ప్రక్కన సెటిలై అనుష్క కనపడినా విష్ కూడా చేయలేదు. అలాగే అనుష్క కూడా నాగచైతన్య కూర్చున్న వరసలో సీట్ ఉన్నా అక్కడ కూర్చోకుండా తన ఫేవరెట్ దర్సకుడు వేదం క్రిష్ ప్రక్కన సెటిలైంది. తన కొలీగ్స్ తో మాట్లాడుతూ ఇద్దరూ బిజిగా గడిపారు కానీ ఇద్దరూ పలకరించుకోకపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.అలాగే అనుష్క అవార్డు తీసుకునే సమయానికి అక్కడ లేకుండా వెళ్లిపోయాడు నాగచైతన్య. నిజానికి నాగచైతన్యకి యోగా గురువు గా ఉన్న అనుష్కని తన తండ్రి ద్వారా పూరీ కి పరిచయం చేయించి సూపర్ ఆఫర్ రప్పించి ఆమె కెరీర్ కి రాచబాట వేసింది నాగచైతన్యనే.


Click it and Unblock the Notifications











