twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ కి దేవదూత అనుష్కే

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో జీసస్ క్ర్రైస్ట్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క దేవదూతగా కనిపించనుందని తెలుస్తోంది.అరుంధతిలో ఆమె చేసిన రోల్ చూసి ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఆర్కిటెక్ గా కనిపించి అలరించనున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది.

    ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్ ఇజ్రాయెల్‌ లోని జెరూసలేంలో జరిగింది. ఇందులో పవన్‌ కళ్యాణ్ సరసన అనుష్క కనిపిస్తోంది. జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు గత రెండేళ్ల నుంచి ఈ చిత్ర కథను తయారుచేసారు. ఇక ఈ చిత్రంలో బాలలు ప్రధాన పాత్ర పోషిస్తారు. బాల రామాయణం, బాల భారతం తరహాలో ఇది బాలలతో రూపొందింస్తున్న క్త్రీస్తు చరిత్ర.

    English summary
    Anushka is playing a role in the Singeetham Srinivas Rao film tentatively titled ‘Prince of Peace’. Pawan Kalyan will be seen in the role of Jesus Christ. anushka will essay the role of an Angel who has been sent by God.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X