సిక్స్‌ప్యాక్‌ చేస్తున్న అనుష్క! (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : ఏం సిక్స్‌ప్యాక్ బాడీలు హీరోలే పెంచాలా..హీరోయిన్స్ చేయకూడదా... నిజానికి సిక్స్ ప్యాక్ అనగానే హీరోలు గుర్తుకువస్తారు. తొలుత బాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత టాలీవుడ్‌కు పాకింది. యంగ్ హీరోలు చాలా మంది ఆరుపలకల దేహంతో అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు వీరి వరుసలో బెంగుళూరు సుందరి అనుష్క చేరబోతోంది.

యోగా విద్యలో నిష్టాతురాలైన ఈ సుందరి యువ హీరోల తరహాలోనే ఆరుపలకల దేహన్ని సంతరించుకోవాలని నిర్ణయించుకుందట. తాను నటిస్తోన్న 'బాహుబలి' 'రుద్రమదేవి' చిత్రాల్లో పాత్రోచితంగా చక్కటి దేహధారుడ్యంతో కనిపించడానికే ఆమె ఈ కఠిన నిర్ణయానికి వచ్చిందని తెలిసింది.

'రుద్రమదేవి' సినిమా కోసం అనుష్క గుర్రపుస్వారీ, కత్తిసాముల్లో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు శారీరకంగా మరింత ఫిట్‌గా కనిపించడానికి సెలవూబిటీలకు శారీరక శిక్షణ అందించే కిరణ్ దెంబ్లా పర్యవేక్షణలో అనుష్క సిక్స్‌ప్యాక్ రూపం కోసం శిక్షణ తీసుకోబోతోంది.

మిగతా విశేషాలు..స్లైడ్ షోలో...

ఆ రెండు చిత్రాలు కోసం...

ఆ రెండు చిత్రాలు కోసం...

అనుష్క... ఆరుపలకల దేహంతో ‘రుద్రమదేవి' ‘బాహుబలి' చిత్రాల్లో ప్రేక్షకులకు సరికొత్త అవతారంలో దర్శనమిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె దేహ దారుధ్యం ఈ చిత్రాలకు ప్లస్ అవుతుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి లభిస్తుందని అంటున్నారు.

'అరుంధతి' నుంచి

'అరుంధతి' నుంచి

హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలవైపు దృష్టిసారిస్తోంది అనుష్క. ఈ కోవలో 'అరుంధతి', 'రాణిరుద్రమ'లాంటి అవకాశాలు చేజిక్కించుకొంది. ఇప్పుడు 'వర్ణ'గా ముస్తాబవుతోంది. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'వర్ణ'. ఆర్య హీరో. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పివిపీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తారు.

కత్తి పోరాటాలు చేస్తూ...

కత్తి పోరాటాలు చేస్తూ...

అనుష్క, తమిళ హీరో ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళంలో ‘ఇరండమ్ ఉలగమ్' అనే చిత్రానికి తెలుగు టైటిల్ ‘బృందావనంలో నందకుమారుడు' కాకుండా ‘వర్ణ' అని మార్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోలు విడుదల చేసారు. గతంలో ‘అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది.

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

‘వర్ణ' లో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సాహిత్యం: చంద్రబోస్‌.

బాహుబలిలో...

బాహుబలిలో...

బాహుబలి చిత్రంలోనూ అనుష్క పాత్ర చాలా డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు. ఆమె పాత్ర కథను మలుపుతిప్పుతుందని, ఈ పాత్ర కోసం ఆమె కొంత ట్రెయినింగ్ సైతం తీసుకుందని సమాచారం. అలాగే స్క్రిప్టు దశ నుంచి ఆమెను చిత్రంలో ఇన్వాల్స్ చేయటం ద్వారా రాజమౌళి మంచి అవుట్ పుట్ కై ప్రయత్నిస్తున్నారు.

రుద్రమదేవి గా

రుద్రమదేవి గా

అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్ పతాకంపై భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రానికి సంబంధించిన రెండోషెడ్యూల్ పూర్తయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఆగస్టు 1 నుండి ప్రారంభం కానుంది. గుణశేఖర్ మాట్లాడుతూ- రెండో షెడ్యూల్‌లో వేయి స్తంభాలగుడి, రంగమంటపం సెట్లలో అనుష్కపై ఒకపాట, మొగిలిచర్ల ఏకవీరాదేవి ఆలయం సెట్‌లో మహామంత్రి శివదేవయ్యగా నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌పై ఓ బిట్ సాంగ్, అనుష్కపై పేర్ని శివతాండవం చిత్రీకరించామని తెలిపారు. చిత్రంలోని తారాగణమంతా ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడంతో45 శాతం షూటింగ్ పూర్తయ్యిందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X