అనుష్క బికినీ పురానణం
బికినీ ప్రదర్శించడం చాలా రేరేగా ఉన్న సమయంలో నేనున్నానంటూ నయనతారా అడుగుపెట్టి కోలీవుడ్ లో టాప్ ఒన్ లో నిలిచింది. తర్వాత ఆ ప్లేస్ ని అనుష్క కొట్టేసింది. 'అరుంధతి"లో జేజెమ్మగా రాయల్ రోల్ లో మెజెస్టిక్ గా కనిపించిన వెంటనే 'బిల్లా"లో బికినీలు ధరించి సెడక్ట్రస్ గా సైతం మెప్పించిన అనుష్క ఇక తన కెరీర్లో మరో 'అరుంధతి" ఇంకో 'బిల్లా" వుండవని తేల్చి చెప్పేసింది. 'అరుంధతి" లాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయని, మళ్లీ దానిని రిపీట్ చేయాలనుకోడం తెలివితక్కువతనమని అంటోంది. అలాగే 'బిల్లా" లో ఒకసారి బికినీ లో కనిపించాను కనుక ఇక మళ్లీ మరోసారి బికినీ ధరిస్తానని అనుకోవడం లేదని చెప్పింది. 'బిల్లా" లో తన పాత్ర హీరోని ఆకట్టుకోవాలి కనుక, సన్నివేశానుసారం బికినీ ధరించానని, ఇక మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేయడం కరెక్ట్ కాదని వివరించింది.


Click it and Unblock the Notifications











